- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ టిక్‌టాక్.. ‘చట్‌పట్’
దిశ, వెబ్‌డెస్క్ : ‘టిక్‌టాక్’.. ఈ యాప్ గురించి తెలియని వాళ్లుండరంటే అతిశయోక్తి కాదేమో. వయసుతో సంబంధం లేకుండా.. ఈ యాప్‌కు అందరూ కనెక్ట్ అయ్యారు. తమకు నచ్చినట్లు వీడియోలు తీసే ఆప్షన్ ఉండటం.. తమ వీడియోలకు కామెంట్లు, లైకులు రావడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తోడవ్వడంతో యూజర్లకు మరింత ఉత్సాహం పెరిగేది. దాంతో టిక్‌టాక్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. అందులోనూ ఇండియన్స్ అయితే ఈ యాప్‌నకు మరింత ఫిదా అయ్యారు. ప్రస్తుతానికి ఈ యాప్ బ్యాన్ కావడంతో దానికి ఆల్టర్నేట్ యాప్ గురించి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయ యాప్స్ జాబితాలో ‘బోలో ఇండియా, మిత్రోన్, రోపోసో, చింగారీ’ యాప్‌లున్నాయి. వీటిలో ఇటీవలే వచ్చిన మిత్రోన్, చింగారీ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో రికార్డు డౌన్‌లోడ్స్ సాధిస్తూ.. దుమ్మురేపుతుండటం గమనార్హం.
ఈ క్రమంలోనే టిక్‌టాక్‌కు ఆల్టర్నేట్‌గా మన తెలంగాణ నుంచి కూడా ఓ యాప్ రావడం విశేషం.. అదే ‘చట్ పట్’. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ చట్‌పట్ యాప్‌కు రూపకల్పన చేశారు. శ్రీనివాస్ ఇదివరకు ఏడు యాప్‌లను రూపొందించినప్పటికీ వాటికి సరైన స్పందన రాలేదు. ప్రస్తుతం టిక్‌టాక్‌పై బ్యాన్ విధించడంతో.. చట్‌పట్‌కు రూపకల్పన చేశాడు. ఈ యాప్ జూన్ 29న ప్లేస్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. కాగా మొదటిరోజే మూడువేల మందికి పైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం. పైగా సోషల్ విభాగం ట్రెండింగ్‌లో చట్‌పట్ యాప్.. టాప్ 10లో 9వ స్థానానికి చేరింది. వినియోగదారులు చట్‌పట్‌కు 4.1 రేటింగ్ కూడా ఇచ్చారు. ఇప్పటికే 5వేలకు పైగా డౌన్‌లోడ్స్ సాధించింది.