చెడు ఆలోచనలే ఇబ్బందికర ప్రవర్తనకు నాంది..

by  |   ( Updated:2020-11-28 08:19:35.0  )
చెడు ఆలోచనలే ఇబ్బందికర ప్రవర్తనకు నాంది..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత సమాజంలో మహిళలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న వేధింపులను మనం రోజు చూస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ఇక్కడా అని కాకుండా ఆధ్యాత్మిక ప్రాంతాలు, ఆఫీసు ప్రదేశాలు, కాలేజీ, బహిరంగ ప్రదేశాలు, జర్నీ సమయాల్లో మహిళలు చాలా మంది తరచుగా వేధింపులను ఎదుర్కొంటున్నారు. కానీ, అందులో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ రాష్ట్ర పోలీసు మహిళా సేఫ్టీ విభాగం ట్విట్టర్ ద్వారా స్పందించింది.

‘బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, అమ్మాయిలను అదే పనిగా చూస్తూ ఇబ్బందికి గురిచేస్తే అది వారి ఆత్మగౌరవానికి హాని కలిగించినట్లేనని స్పష్టం చేసింది. భౌతికంగా వారు మీ శరీరాన్నే తాకలేదు కదా అనే అనుమానానికి తావే లేదు. ఎందుకంటే అవతలి వ్యక్తుల మనసులోని చెడు ఆలోచనలే.. వారి ఇబ్బందికరమైన ప్రవర్తనకు పునాది అని, వాటిని ఆదిలోనే నివారించాలని’ ట్విట్టర్ ద్వారా కోరారు. అందుకోసం ప్రత్యేకంగా ఓ పోస్టర్ను రూపొందించారు. దాని ద్వారా యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు సమాచారం.ఈ పోస్టును తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం రీట్వీట్ చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed