- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతర్జాతీయ క్యారికేచర్ పోటీకి ఆహ్వానం
దిశ, కరీంనగర్: బహుభాషా కోవిదుడు, ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన తెలుగు వాడు పీవీ నరసింహ రావు జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్టూనిస్టుల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో ‘అంతర్జాతీయ స్థాయి క్యారికేచర్’ పోటీ నిర్వహిస్తున్నామని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు జూన్ 20 లోగా [email protected] ఈ మెయిల్‌కు చేయాలన్నారు. బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్‌లో కూడా పంపొచ్చని, పేపర్‌పై వేసి పంపే వారు A4 సైజ్‌లో వేసి స్కాన్ చేసి పంపాలని సూచించారు. డిజిటల్ ఫార్మట్‌లో పంపేవారు 2480 వెడల్పు, 3508 ఎత్తు పిక్సల్స్ సైజ్ 150 లేదా 300 డీపీఐలో డ్రా చేసి పంపాల్సి ఉంటుంది. పెద్ద సైజ్‌లో డ్రా చేసినా పైన సూచించిన సైజ్‌లో ఫిట్ అయ్యేట్టు ఉండాలి. అవసరమైతే భవిష్యత్తులో మీ క్యారికేచర్ ప్రదర్శనకు అనుకూలించాలనే ఉద్దేశ్యంతో ఈ నిభందనలు విధించామని వారు వివరించారు. పూర్తి వివరాల కోసం తెలంగాణా కార్టూనిస్టు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి 917780137695, ఆర్గనైజింగ్ కార్యదర్శి కళ్యాణం శ్రీనివాస్ 919346273799లను కాంటాక్ట్ చేయాలన్నారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు పురస్కారం, పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు ఇస్తామని తెలిపారు.