- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశానికే రోల్‌మోడల్ తెలంగాణ: హరీశ్ రావు
దిశ,గజ్వేల్: అత్యాధునిక, సాంకేతిక సేవలను ఉపయోగించడంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్‌గా నిలిచిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆరేండ్లలోనే తెలంగాణ పోలీసింగ్ జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలిచిందని చెప్పారు. పోలీసుల మెరుగైన సేవల వల్లే హైదరాబాద్‌తోపాటు పలు స్టేషన్లకు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ వచ్చిందని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ మండల కేంద్రంలో ఆధునిక హంగులతో నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్‌ను హోం మంత్రి మహమూద్ అలీతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటైన వెంటనే అభివృద్ధి, పోలీస్ వ్యవస్థపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారని చెప్పారు. షీటీమ్స్, సీసీ కెమెరాలు, ఆన్‌లైన్ వ్యవస్థ, సాంకేతిక సేవలతో రాష్ట్రం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని వెల్లడించారు. ఇక్కడ అమలు చేస్తున్న పోలీస్ సేవలు ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని కేంద్రమే చెప్పడం సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమన్నారు.