మన సోనాకు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్?

by Shamantha N |
మన సోనాకు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సోనా రైస్‌కు అంతర్జాతీయంగా భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో మన సోనాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ కల్పించే ప్రయత్నాలు ముమ్మరం కాగా, తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048)కి బ్రాండ్‌ కల్పించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ వర్సిటీలు, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది.

సెప్టెంబర్‌ వరకు ఈ ఒప్పందం ఫలితాలు కనిపించాలని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీసీ బీ జనార్దన్‌రెడ్డి స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయాలవల్ల వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకతల్లో తెలంగాణ మిగులు రాష్ట్రంగా మారిందన్నారు. కిందటిసారి కంటే ఈ ఏడాది మన సోనా సాగు పెరిగిందన్నారు. పీజేటీఎస్‌ఏయూ ఇటువంటి రకం విత్తనాన్ని రూపొందించినందుకు ఉపకులపతి, శాస్త్రవేత్తలను అభినందించారు.

తెలంగాణ సోనాకు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి డిమాండ్‌ పెరుగుతున్నదని ఉపకులపతి ప్రవీణ్‌రావు తెలిపారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చే దిశగా మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఐఎస్‌ఈ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ శేషాద్రి, పీజేటీఎస్‌ఏయూ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎస్‌ సుధీర్‌కుమార్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ డాక్టర్‌ ఆనంద్‌సింగ్‌, ఐఎస్‌బీ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశానికి డీఎన్‌వీ కుమారగురు మాడరేటర్‌గా వ్యవహరించారు.

Advertisement

Next Story

Most Viewed