- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కీలక డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: భూముల గురించి ఏబీసీడీలు తెలియని సంస్థకు ధరణి పోర్టల్‌ను అప్పగించడం వల్ల కొత్త సమస్యలు తలెత్తాయని, కొత్త విధానాలను రైతులపై బలవంతంగా రుద్దుతున్నారని తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ గౌడ్మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్‌లో ఉపాధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నారగోని మాట్లాడుతూ..
గత ఏడాది ఆగస్టు 26 న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను రిజిస్టర్ చేయొద్దని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 141 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లకు మెమో ద్వారా ఆదేశాలు ఇచ్చారన్నారు. కానీ ఆలాంటి ఆదేశాలు చెల్లవని గత ఆగస్టు 23న హైకోర్టు ఒక కేసులో తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కోర్టు తీర్పును గౌరవించి పంచాయతీ లేఅవుట్లలో నిలుపుదల చేసిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలని ఐజీ శేషాద్రిని కోరగా సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అధికారులు కోర్టు తీర్పును కూడా లెక్క చేయడం లేదని ఆరోపించారు.
కరోనా కంటే ధరణిలోని సమస్యలతోనే రైతులు, రియల్టర్లు ఇబ్బంది పడుతున్నారు. పిల్లల పెళ్లిళ్ల కోసమో, విద్య, వైద్య ఖర్చుల అవసరాల కోసమో భూములను అమ్ముకుందామంటే సమస్యలు సృష్టించారన్నారు. ధరణిలో 20 రకాల సమస్యలు ఉండటం వల్ల రిజిస్ట్రేషన్లు కావడం లేదన్నారు. ఏడాది కాలమైనా సమస్యలను పరిష్కరించలేనప్పుడు ధరణి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గించాలని, మధ్య తరగతి ప్రజలకు ప్లాట్ల ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలనారు.
ప్రభుత్వం చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బంద్ చేయాలని డిమాండ్ చేశారు. పిడికెడు మంది కార్పొరేట్ వ్యాపారుల అభివృద్ధి కోసం నిబంధనలు తీసుకురావడం దురదృష్టమన్నారు. రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి భవనానికి స్థలం కేటాయించాలని నారగోని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మేకపోతుల నర్సయ్య, జనరల్ సెక్రటరీ పగడాల రంగారావు, రాజు గౌడ్, పెద్దిరాజుతో పాటుగా వివిధ జిల్లాలకు చెందిన 1000 మంది పాల్గొన్నారు.