- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ విజన్ వల్లే అది సాధ్యమైంది : మినిస్టర్
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విద్యుత్ రంగం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విజన్ వల్లే రాష్ట్రానికి పేరు, ప్రఖ్యాతలు వచ్చాయని, తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని ఆయన స్పష్టం చేశారు. దేశ సగటు విద్యుత్ వినియోగం 1,208 యూనిట్లు ఉంటే, కేవలం తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగమే 2,071 యూనిట్లుగా ఉందని, ఇది దేశ సగటు వినియోగం కంటే 71 శాతం అధికమని జగదీశ్ రెడ్డి తెలిపారు. దేశ చరిత్రలోనే తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
సింగరేణిలో అప్రెంటిస్ షిప్‌నకు ఐటీఐ, ఇంజినీరింగ్, డొప్లొమా, ఇంటర్, ఒకేషనల్ పూర్తి చేసిన వారికి ఇప్పటికే అవకాశమిచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ థర్డ్ లైన్‌కు సంబంధించిన పనులను పల్లె ప్రగతి పనుల్లో పూర్తిచేశామని, ఇంకా ఎక్కడైనా పెండింగ్‌లో ఉన్నట్లు తమ దృష్టికి తీసుకువస్తే త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. సింగరేణి బ్లాస్టింగులకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో బొగ్గుకు డిమాండ్ తగ్గే అవకాశం ఉందని, విద్యుత్ ఉత్పత్తిలో ఎక్కువగా వినియోగించడమే అందుకు కారణమని అన్నారు. బొగ్గు వినియోగాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా పాలసీలు మారుతున్నయని, అందుకు అనుగుణంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి స్పష్టం చేశారు.