- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హో.. ఉర్కుర్కి కారెక్కితే ఇజ్జతి పాయే!
దిశ, వెబ్ డెస్క్: అయ్యింది! నూరుకు నూరు శాతం జనాలు మతిల అన్కున్న ముచ్చట్నే బరాబర్ నిజమైంది. గిన్నిరోజుల సంది ఎగిరి ఎచ్చుల కొట్టినొళ్లు దాదాపు ఇజ్జతి పోగొట్టుకున్నరు. ఇగ వాళ్ల పరిస్థితి ఎట్లుందంటే కడుపుల దాస్కుంటే మురిగిపోద్ది, చెప్పుకోకుంటే నోరు ఆగదన్నట్లుగా తయారైంది. గింతకు ఎవలి ఇజ్జతి ఎవలు తీసిండ్రు, ఎవలి పరువు ఎవలు పొగొట్టిరనుకుంటున్నరా. గదే గా కథలోకి వస్తున్నా.. గా ముచ్చట్నే చెప్తున్నా..
మొన్న నాల్గురోజుల కింద కేసీఆర్ సారు అసెంబ్లీ మాట్లాడుకుంట ఎమన్నడు.. చేయిగుర్తు పార్టీని నేనస్సలే చీల్చలేదు. అస్సలు చీల్చాల్సిన పనిగూడ మాకస్సల్లేదు. గాళ్లే వచ్చి మా మంత్రులు, ఎమ్మెల్యేలను బతిలాడిండ్రు. గిదే ముచ్చట్ను వచ్చి మావొళ్లు నా చెవిలే ఏస్తే నేనస్సలే వద్దన్న. గింత బంపర్ మెజార్టీ ప్రజలిచ్చిర్రు. గాళ్లను తెచ్చుకొని మన పక్కన కూస బెట్టుకుంటే జనాలు తిట్టుకున్నరని జెప్పిన. మల్ల కొన్నిరోజ్లకు మా ఎమ్మెల్యేలు వచ్చి గాళ్లసలే ఇంటలేరు. కారెక్కుతం కారెక్కుతమని జిజ్జు జేత్తురని చెప్పిండ్రు. ఇగ నేను యాగలేక ఏమన్నంటే మూడింట రెండొంతుల మంది వస్తే ప్రాబ్లమ్ ఉండదని చెప్పిన, గట్లనే వచ్చి విలీనమైర్రని చెప్పకొచ్చిండ్రు. ఇంకో ముచ్చటేమన్నరంటే గిప్పుడున్న కేంద్ర ప్రభుత్వం టీడీపీ ఎంపీలను ఢామ్మున మింగలేద, రాజస్థాన్ల కాంగ్రెసొళ్లు వేరేటొళ్లను కలుపుకోలేద అన్కుంట పన్ను తీపి తీసేటోడి పన్నుపై గుద్దినట్లుగా మాట్లాడిండు.
గి ముచ్చటంత కేసీఆర్ సారు గాళ్ల ముందర్నే మాట్లాడితర్కే ఆళ్లంత తల్కాయ కిందకేసున్నంత పనిజేసిండ్రు. గాళ్లే బతిలాడ్తే పార్టీలకొస్తిమి, గిప్పుడేమో రెండేళ్ల పొద్దు ఇడ్చినంక అటీటు గాకుండ మధ్యల గాళ్లను మేం రమ్మనలేదు. బతిలాడి సుట్టు తిర్గితేనే చేర్చుకున్నం అంటర్కే లోపట లోపట నామూష్గా ఫీలై పోతున్నరు. ఇగ అటు జనాలు గూడ గీళ్లకు గిప్పుడు మంచిగైంది. సూచిర్రా హో… ఉర్కి ఉర్కి కారెక్కితే నిండు సభల నాల్గుకోట్ల మంది జనాలకు తెల్సేటట్టు ఇజ్జతి తీసే. ఇంక ముందు గిట్లనే పార్టీలు మారేటొళ్లకు గిదో మంచి గుణపాఠమని గుసగుసలు పెట్టుకుంటున్నరు.
tags : Congress, MLAs, Cm KCR, Ministers, Assembly, Central Government, TDP MPs, Rajasthan