తెలంగాణలో తొలుత 80 లక్షమందికి కరోనా వ్యాక్సిన్..,ఎప్పుడంటే

by Anukaran |   ( Updated:2020-12-15 22:53:31.0  )
తెలంగాణలో తొలుత 80 లక్షమందికి కరోనా వ్యాక్సిన్..,ఎప్పుడంటే
X

దిశ, వెబ్ డెస్క్ : దేశం అంతా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం..,దేశంలోని అన్నీ రాష్ట్రాలకు గైడ్ లైన్స్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

జనవరిలో సంక్రాంతి పండుగ తరువాత రాష్ట్ర వ్యాప్తంగా తొలుత 80 లక్షల మందికి తొలిడోస్ కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసేలా యాక్షన్ ప్లాన్ ను రెడీ చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరక్టర్ జీ. శ్రీనివాస్ రావు నేషనల్ మీడియాకి తెలిపారు. ఇందులో వ్యాక్సిన్ పంపిణీ కోసం ప్లానింగ్, ట్రైనింగ్ తో పాటు స్ట్రాటజీని తయారు చేసేందుకు కరోనా వార్ రూమ్ లను కంట్రోల్ రూమ్ లుగా మారుస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు అత్యవసర పరిస్థితి కింద కరోనా వ్యాక్సిన్ ను వినియోగించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదన్న పబ్లిక్ హెల్త్ డైరక్టర్.., ఒకవేళ అనుమతి ఇస్తే దేశ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా భారత్ బయోటెక్ తో పాటు సీరం ఇండియా ఇనిస్టిట్యూట్ తయారు చేసిన వ్యాక్సిన్లు వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

మూడో వ్యాక్సిన్ ” ఫైజర్ “భారత్ లో వినియోగం మరింత కఠినంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎందుకంటే మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద స్టోర్ చేసుకునే సామర్ధ్యం చాలా అవసరం. ఒకవేళ ఫైజర్ ను వినియోగించుకోవాల్సి వస్తే భారీ ఎత్తున నిధుల్ని ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరక్టర్ జీ. శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.

ఫేజ్‌ల వారీగా అందనున్న వ్యాక్సిన్

ఇక 80 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్రానికి 1.6 కోట్ల వ్యాక్సిన్ అందనున్నట్లు , ఆ వ్యాక్సిన్‌ను ఫేజ్‌ల వారీగా విభజిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరక్టర్ జీ.శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.

తొలిఫేజ్ లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన సుమారు 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ 3 లక్షల మందిలో డాక్టర్లు , నర్సులు, వార్డ్ బాయ్స్ మరియు టెక్నీషియన్లు ఉన్నారు.

రెండో ఫేజ్ లో ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ఉన్నారు. ఇందులో లక్ష మంది పోలీసు సిబ్బంది, శానిటరీ కార్మికులు మరియు రక్షణ సిబ్బంది ఉన్నట్లు చెప్పారు.

మూడవ ఫేజ్ లో రాష్ట్ర జనభాలో ఉన్న 18 శాతం మంది ఉన్న 50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
నాలుగవ ఫేజ్ లో రాష్ట్ర జనాభాలో ఉన్న 2-3 శాతం ఉన్న కోమోర్బిడిటీస్ (గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, సిఓపిడి)సమస్య ఉన్న వారికి వ్యాక్సిన్ ను అందించనున్నారు.

ప్రత్యేకంగా వ్యాక్సిన్ సెంటర్లు

10 కోట్ల మోతాదు సామర్ధ్యం ఉన్న కరోనా వ్యాక్సిన్లను స్టోర్ చేసేందుకు 10 సెంటర్లను సిద్ధం చేయనున్నారు. ఈ సెంటర్లలో వ్యాక్సిన్లను స్టోర్ చేసే సామర్ధ్యాన్ని పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరక్టర్ చెప్పారు. సుమారు 2 కోట్ల వ్యాక్సిన్ల ను సెంట్రల్ స్టోరేజ్ లో స్టోర్ చేసుకునే సామర్ధ్యాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు.

ప్రతీ జిల్లాకు కరోనా వ్యాక్సిన్ వాహనాలు

ఇప్పటికే దేశంలో పాటు రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాటు చేసే డ్రైవ్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నట్లు చెప్పిన తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరక్టర్ .., రాష్ట్రంలో ఇప్పటికే వాక్ – ఇన్ కూలర్ల కేంద్రాలు సుమారు వెయ్యి ఉన్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed