తెలంగాణ వాసికి బంపర్ బహుమతి….

by Anukaran |
తెలంగాణ వాసికి బంపర్ బహుమతి….
X

దిశ వెబ్ డెస్క్:
దుబాయ్‌లో తెలంగాణ వాసికి బంపర్ బహుమతి లభించింది. దుబాయ్ లక్కీ డ్రాలో రూ.7.3 కోట్లను తెలంగాణకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గెలుచుకున్నారు. ఈ విషయాన్ని గల్ప్ న్యూస్ గురువారం వెల్లడించింది .వివరాల్లో కెళితే…ఏడాది క్రితం ఉద్యోగం కోసం దుబాయ్ కు గ్రంధి లక్ష్మీ వెంకట తాతారావు వెళ్లారు. అయితే దుబాయ్ లో 1999 నుంచి మిలీనియం మిలియనీర్ పేరిట లక్కీడ్రాను నిర్వహిస్తున్నారు. కాగా ఆ లాటరీ టికెట్టుును తాతారావు కొన్నారు. తాజాగా నిర్వహించిన లక్కీ డ్రాలో ఆయనకు మొదటి బహుమతి వచ్చింది. బహుమతి కింద ఆయనకు నిర్వాహకులు రూ.7.3కోట్లు ఇవ్వనున్నారు. దీనిపై తాతారావు మాట్లాడుతూ….బతుకు తెరువు కోసం వచ్చిన తనకు ఈ దేశం కావాల్సినంత డబ్బు ఇచ్చిందని అన్నారు. ఈ డబ్బుతో ప్రశాంతంగా బతుకుతానని ఆయన తెలిపారు.

Advertisement

Next Story