తెలంగాణలో ఓపెన్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల

by Shyam |
తెలంగాణలో ఓపెన్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్ఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టుగా సోమవారం ప్రకటన ద్వారా తెలిపారు. పాఠశాల విద్యను పూర్తి చేయలేకపోయిన అభ్యర్థుల కోసం ఈ కోర్సులను ప్రవేశపెట్టామని వివరించారు. 10వ తగరతితో పాటు ఇంటర్ విద్యను కూడా అందిస్తున్నామని తెలియజేశారు. మీ సేవా, టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవల్సిందిగా సూచించారు. పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని లేదా టీఓఎస్ఎస్ వెబ్‌సైట్‎ను సంప్రదించాల్సిందిగా సూచించారు.

Advertisement

Next Story