దుబాయ్‌లో కరోనాతో కోరుట్లవాసి మృతి

by Sridhar Babu |
దుబాయ్‌లో కరోనాతో కోరుట్లవాసి మృతి
X

దిశ, కరీంనగర్: దుబాయ్‌లో కరోనా సోకి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చే పరిస్థితి లేక అక్కడే దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో చివరి చూపునూ నోచుకోలేని ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళ్తే.. మోహన్‌రావు పేటకు చెందిన మునిగంటి మల్లేశం అలియాస్ రాజం(48) దుబాయ్‌లోని జెబలాలిలో ఓ ప్రైవేట్ కంపెనీ‌లో సాధారణ వర్కర్‌గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలో అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఏప్రిల్ 27న ఆయనను హాస్పిటల్‌‌కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే మృతిచెందాడు. అనంతరం మృతదేహానికి పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. మల్లేశం మృతదేహాన్ని స్వదేశానికి పంపే వీలులేక అక్కడే దహన సంస్కారాలు చేశారు. ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం(ఈటీసీఏ) ఆధ్వర్యంలో మల్లేశం అంత్యక్రియలు మంగళవారం జరిగాయి. కాగా, మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఈటీసీఏ వ్యవస్థాపకుడు పీచర కిరణ్ కుమార్, అధ్యక్ష్యుడు రాధారపు సత్యంలు విజ్ఞప్తి చేశారు.

Tags:corona, dubai, migrate worker, dead, korutla, ts news

Advertisement

Next Story