- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కేసులు పెరిగితే మీదే బాధ్యత..
దిశ, తెలంగాణ బ్యూరో : రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, సమావేశాలతో కరోనా వ్యాప్తి భారీగా పెరిగే అవకాశం ఉన్నదని వైద్యారోగ్యశాఖ హెచ్చరించింది. మళ్లీ కేసులు పెరిగితే కొవిడ్ నిబంధనలు పాటించకుండా తిరిగే లీడర్లే బాధ్యత వహించాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. రాజకీయ పార్టీలు చేపట్టే కార్యక్రమాల్లో ఖచ్చితంగా కరోనా మార్గదర్శకాలు అమలయ్యేలా నాయకులు అవగాహన కల్పించాలన్నది. వ్యాక్సిన్ తీసుకున్న వారినే సభలు, సమావేశాలకు హాజరయ్యేలా చూడాలన్నది. అంతేగాక మాస్కు, భౌతికదూరం, శానిటేషన్ వంటివి పకడ్బందీగా అమలవ్వాలని ఆరోగ్యశాఖ నొక్కి చెప్పింది. కరోనా పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది.
సభలతో ప్రజల్లో టెన్షన్ …
వివిధ రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న సభలు, సమావేశాలతో వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనని ప్రజల్లో టెన్షన్ ప్రారంభమైంది. హుజూరాబాద్ ఉపఎన్నికలతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా వేర్వేరు రాజకీయ పార్టీలు విస్ర్తృతంగా ఏర్పాటు చేస్తున్న మీటింగ్‌లతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అంతర్గతంగా ఆందోళన చెందుతున్నది. ప్రభుత్వానికి కూడా ఇదే విషయాన్ని వివరించింది. గత నెల రోజుల నుంచి హుజూరాబాద్‌లో లీడర్లు చేస్తున్న ప్రచారంతో క్రమంగా పాజిటివ్ రేట్ పెరుగుతున్నట్లు వివరించింది. లక్షణాలున్నోళ్లు ఇంటింటికి తిరగడం వలన వ్యాప్తి పెరిగినట్లు స్పష్టం చేసింది. అలాంటి వారిని క్వారంటైన్ చేసే బాధ్యతను లీడర్లు తీసుకోవాలన్నది. అంతేగాక ఇప్పటి వరకు టీకా తీసుకోని వారిని గుర్తించి దగ్గరుండి మరీ డోసును ఇప్పించాలన్నది. వ్యాధి లక్షణాలు ఉన్నోళ్లను టెస్టుల కొరకు పంపాలన్నది. పార్టీలు, సభలతో ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా నిర్వహించాలన్నది.
లీడర్లలోనూ అదే ఆందోళనే..
కరోనా సెకండ్ వేవ్ సభలు, సమావేశాలతోనే షురూ అయింది. నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియాలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఉప ఎన్నికల సభ కారణంగా సీఎం కేసీఆర్‌తో పాటు ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలూ వైరస్ బారిన పడ్డారు. అంతేగాక పలువురు మీడియా ప్రతినిధులకూ పాజిటివ్ తేలింది. వైరస్ కారణంగా ఇద్దరు ముగ్గురు మరణించినట్లు సమాచారం. అంతేగాక ఆ సభ నిర్వహించిన వారం రోజుల తర్వాత ఆ నియోజకవర్గంలో పాజిటివ్ రేట్ పతాక స్థాయికి వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ వి.హనుమంతరావు కూడా ఓ సభకు హాజరై వైరస్ బారిన పడ్డారు. అనంతరం క్రమక్రమంగా మిగతా ప్రాంతాలకు కొవిడ్ వ్యాప్తి చెంది, లీడర్లతో పాటు లక్షలాది మంది ప్రజలు వైరస్‌కు ఇన్ ఫెక్ట్ అయ్యారు. అయితే ఆ సారి కూడా అలాంటి పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్యశాఖ అంతర్గతంగా చెబుతున్నది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు హాజరైన మాజీ ఎంపీ అంజనీకుమార్‌కు వైరస్ సోకి అపోలో ఆసుపత్రిలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ లీడర్ జి.కిషన్ రెడ్డి నిర్వహించిన ప్రజాదీవెన ఆశీర్వాద యాత్రలో పాల్గొన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆయన కూడా అపోలో ఆసుపత్రిలో చేరి కాక్ టెయిల్ తీసుకొని చికిత్స పొందుతున్నారు. మరోవైపు బహుజన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆయన నల్గొండలో నిర్వహించిన సభకు హాజరై వైరస్ బారిన పడ్డారు. దీంతో గాంధీలో కాక్ టెయిల్ తీసుకొని హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందారు. అయితే సభలు, పార్టీలకు హాజరైన వివిధ ముఖ్య నేతలతో పాటు ఆయా పార్టీల లీడర్లకు పాజిటివ్ తేలుతుండటంతో ప్రజల్లో కలవరం ప్రారంభమైంది. దీంతో వైద్యారోగ్యశాఖ అలెర్ట్ సూచిస్తోంది.
అదుపులోనే ఉన్నది కానీ.. : డీహెచ్
రాష్ర్టంలో కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉన్నది. కానీ కొవిడ్ నిబంధనలను సమర్ధవంతంగా పాటించకపోతే ముప్పు తప్పదు. ఇప్పటికే వ్యాక్సినేషన్‌ను స్పీడప్ చేశాం. అర్హులైన ప్రతీ ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరుతున్నాను. సీజనల్, కరోనా లక్షణాలు ఉన్నోళ్లంతా పీహెచ్‌సీలకు వెళ్లి ఎప్పటికప్పుడు టెస్టులు చేసుకోవాలి. నిర్లక్ష్యం వహించవద్దు.