తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో కొత్త పథకానికి టీఆర్ఎస్ సర్కార్ ప్లాన్?

by Anukaran |   ( Updated:2021-10-03 01:01:06.0  )
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. మరో కొత్త పథకానికి టీఆర్ఎస్ సర్కార్ ప్లాన్?
X

దిశ, వెబ్‌డెస్క్ : అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్న మాటలే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ కొత్త పథకానికి తెర లేపింది. కులాల ప్రతిపాదికన విభజించి ఒక్కొక్కరి ఒక్కో విధంగా తెలంగాణ ప్రభుత్వం పథకాలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో దళితుల ఓట్ల కోసం ‘దళిత బంధు’ పథకం ప్రవేశ పెట్టింది. ఇప్పటికే యాదవ్‌ల కోసం గొర్రెలు పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పేదలకు మరింత ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా.. గ్రామాల్లోని పేదలకు నాటు కోళ్లు అందించాలని భావిస్తోంది. దీంతో తెలంగాణలో మరో కొత్త పథకం రానున్నట్లు తెలుస్తోంది. నాటు కోళ్ల పెంపకంతో పేదలకు ఆదాయం సమకూర్చడంతో పాటు రూరల్ ఏరియా‌లో న్యూట్రీషియన్ లోపాన్ని అధిగమించవచ్చని భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రెండు కోట్ల నాటు కోళ్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ప్లాన్ చేస్తోందని సమాచారం. అయితే, ఈ పథకం ఎవరికి ఇస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, 58 లక్షల కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని ఈ పథకం తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఏకంగా 163 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం. యూనిట్‌కు ఐదుకోట్ల చొప్పున ఏటా 40 లక్షల కోట్లను ఐదేళ్లపాటు పంపిణీ చేయాలని భావిస్తోంది. ఈ కోళ్ళతో ఏటా 85 కోట్ల గుడ్లు 8.5 మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతుందని లెక్కలు వేసింది. గుడ్ల ఉత్పత్తి తో వేగంగా 350 కోట్లు అలాగే కోళ్ల అమ్మకాలతో 290 కోట్లు మొత్తం 630 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story