- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్ లైన్ లోన్ యాప్స్ : మిమ్మల్ని వేధిస్తుంటే మాకు ఫిర్యాదు చేయండి
దిశ, వెబ్ డెస్క్ : గత కొద్ది రోజులుగా ఆన్ లైన్ లోన్ యాప్స్ కారణంగా ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి.ఆర్ధిక ఇబ్బందులతో ఎవర్ని అప్పు అడగలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులు ఈ ఇన్ స్టంట్ మనీ లోన్ యాప్స్ కు అలవాటు పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉండి.., ఐదుగురి ష్యూరిటీ ఉంటే చాలు నిమిషాల్లో అప్పు ఇస్తామంటూ విద్యార్ధులు, నిరుద్యోగుల్ని టార్గెట్ చేస్తూ ప్రతీరోజూ కోట్ల సంఖ్యలో బిజినెస్ చేస్తున్నారు. 10 వేల నుంచి 2 లక్షల వరకు సెకన్లలో లోన్ తీసుకోవచ్చు. అయితే ఇచ్చిన గడువుకి ఒక్కరోజు లేటైనా అంతే సంగతులు. ష్యూరిటీ ఉన్న వాళ్లకు మెసేజ్ లు పంపించి చిత్రహింసలకు గురి చేస్తారు. గడువు దాటింది డబ్బులు కట్టాలంటూ ఒక్కరోజులోనే తనకు 60సార్లు ఫోన్ చేసి చెప్పలేని విధింగా హింసించారని వాపోయాడు. ఇలా బాధితుల్ని మాటలతో చిత్రహింసలకు గురిచేయడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మైక్రోఫైనాన్స్ బాధితులు ఆత్మహత్యలు చేసుకోవడం పై ఆన్ లైన్ లోన్ యాప్స్ పై విచారణ ప్రారంభించారు. విచారణలో సుమారు 200 ఆన్ లైన్ లోన్ యాప్స్ ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ యాప్స్ అన్నీ ఆర్బీఐ నిబంధనలు విరుద్దంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని ఏసీపీ ప్రసాద్ తెలిపారు.
ఈ యాప్స్ ను తొలగించేలా కేంద్ర హోం శాఖ, ఐటీ శాఖ లకు తెలంగాణ పోలీస్ శాఖ లేఖ రాసినట్లు చెప్పారు. మరోవైపు గూగుల్ సంస్థకు సైతం ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా ఉన్న యాప్స్ ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రసాద్ మాట్లాడుతూ.., ఎవరైతే ఫోన్లో ఎక్కువ సేపు గడుపుతారో వాళ్లనే యాప్ నిర్వాహకులు టార్గెట్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎవరూ ఆన్ లైన్ లోన్ యాప్స్ ను వినియోగించవద్దని సూచించారు.
ఇప్పటికే తమకు పదుల సంఖ్యల ఫిర్యాదులు అందాయని.., డబ్బులు కట్టాలని వేధింపులకు పాల్పడినా, అసభ్య పదజాలంతో ధూషించినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. త్వరలో గూగుల్ ప్లేస్టోర్ లో ఉన్న ఆన్ లైన్ లోన్ యాప్స్ అన్నింటిని తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.