- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దళారులను నమ్మిన ప్రభుత్వం.. రైతులకు నష్టం
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: చేతులు కాలాక ఆకులు పట్టడమంటే ఇదేనేమో మరి. రైతులు శనగ పంటను తక్కువ ధరకే విక్రయించాక, తాజాగా నెలన్నర ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను సర్కారు ఏర్పాటు చేస్తోంది. రైతులకు మద్దతు ఇవ్వాల్సిన సర్కారు దళారులకు మద్దతుగా నిలుస్తోందనే విమర్శలు వస్తున్నాయి. రైతు చేతికి పంట వచ్చే సమయంలో కొనుగోళ్లు చేపడితే రైతుకు ప్రయోజనం చేకూరేదని, పుణ్యకాలం గడిచిపోయాక సెంటర్లు పెడితే దళారులకే లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్దతు ధర రూ.5100గా ఉండగా బయట మార్కెట్లో దళారులకు రూ.4300 నుంచి రూ. 4400 చొప్పున అమ్మారు. దీంతో రైతులు క్వింటాలుకు రూ.700 రూ.800 వరకు నష్టపోయారు. ఈ లెక్కన జిల్లా రైతులు సుమారు రూ.50 కోట్ల మేర ఆదాయం కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో శనగ సాగు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు వానకాలంలో సోయాబీన్, మినుము, పెసర పంటలను సాగు చేస్తుండగా.. రబీలో పెద్ద ఎత్తున శనగ పంటను సాగు చేస్తుంటారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో శనగ పంట సాగు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 70 వేల ఎకరాలు, నిర్మల్ జిల్లాలో 55 వేల ఎకరాలు, మిగతా రెండు జిల్లాల్లో 25 వేల ఎకరాల వరకు శనగ సాగు చేశారు. ఫిబ్రవరి రెండో వారంలోనే పంట చేతికి వచ్చింది. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉమ్మడి జిల్లాలో 9 లక్షల నుంచి 10 లక్షల క్వింటాళ్ల మేర దిగుబడి రాగా, 80 నుంచి 90 శాతం మంది రైతులు పంటను దళారులు, మధ్యవర్తులు, బయట మార్కెట్లో ప్రైవేటు ట్రేడర్లకు ఇప్పటికే విక్రయించేశారు.
నెలన్నర ఆలస్యంగా..
ప్రతీ ఏడాది ప్రభుత్వం మార్క్ఫెడ్ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఈ సారి కొనుగోల కేంద్రాల ఏర్పాటు అంశాన్ని పట్టించుకోలేదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాకు తొమ్మిది కేంద్రాలు, నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో మూడు కేంద్రాలను మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఆదిలాబాద్, జైనథ్ లో ఒక్కో కేంద్రాన్ని మాత్రమే ప్రారంభించగా.. మిగతా చోట్ల విడతల వారీగా ప్రారంభిస్తామని చెబుతున్నారు. ముధోల్, భైంసా, కుభీరులో రెండు రోజుల్లో ఒక్కో కేంద్రం చొప్పున ప్రారంభించనున్నారు. గత ఏడాది రైతు చేతికి పంట వచ్చిన సమయంలోనే 20కిపైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సారి మాత్రం నెలన్నర ఆలస్యంగా తాజాగా రెండు రోజుల క్రితం రెండే కేంద్రాలు ప్రారంభించగా.. మిగతా 10 కేంద్రాలు త్వరలో ప్రారంభించనున్నారు.
80 శాతానికి పైగా విక్రయాలు
ఫిబ్రవరి నెల రెండో వారంలోనే శనగ పంట చేతికి రాగా.. సర్కారు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతులు దళారులు, మధ్యవర్తులు, ప్రైవేటు ట్రేడర్లకు, బయట మార్కెట్లో క్వింటాకు రూ.4300 రూ. 4400చొప్పున విక్రయించారు. ఇప్పటికే 80 నుంచి 90 శాతం మంది రైతులు సరుకు విక్రయించారు. వాస్తవానికి ప్రభుత్వ మద్దతు ధర రూ.5100 చొప్పున ఉండగా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవటంతో రైతులు క్వింటాలుకు రూ.700 నుంచి రూ. 800 చొప్పున నష్టపోవాల్సి వచ్చింది. సర్కారు కొనుగోలు కేంద్రాలు సకాలంలో పెట్టక పోవడరంత ఉమ్మడి జిల్లా రైతులకు సుమారు రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లింది. రైతుల చేతికి శనగ పంట రావడంతో అమ్మాలా.. వద్దా.. అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది రైతులు ఇప్పటికే విక్రయించారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో క్వింటాకు రూ.4900 ధర పలుకుతోంది. దీంతో ముందే విక్రయించిన రైతుల పరిస్థితి రెండింటికి చెడ్డ రేవడిలా మారింది.