- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగదు చెల్లింపులకే ప్రభుత్వ ధరలు వర్తిస్తాయి
దిశ, న్యూస్‌బ్యూరో: కార్పొరేటు ఆసుపత్రులు కరోనా చికిత్సకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తుండడంపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఆదివారం ఒక పత్రికా ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చింది. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును నగదు రూపంలో చెల్లిస్తేనే ప్రభుత్వ ధరలు వర్తిస్తాయని, హెల్త్ ఇన్సూరెన్సు, ప్రభుత్వ పథకాలు, వివిధ రకాల ఒప్పందాల ప్రకారం జరిగే చికిత్సకు ఈ ధరలు వర్తించని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు. నగదు చెల్లింపులతో జరిగే చికిత్సకు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఏ వార్డుకు ఎంత, ఏయే అవసరాలు ఆ ప్యాకేజీలో భాగంగా ఉంటాయో గతనెల 15న జారీ చేసిన ఉత్తర్వుల్లోనే స్పష్టత ఉందని పేర్కొన్నారు.
కరోనా టెస్టింగ్, చికిత్సలకు ఏయే ఆసుపత్రుల్లో ఎంతెంత వసూలు చేయాలో, ఏ వార్డులో ఎంత ఖర్చవుతుందో విశ్లేషించిన తర్వాతనే ధరలను ఖరారు చేసినందున ఆ ధరల ప్యాకేజీలో ఏయే అంశాలు కలిసి ఉన్నాయో ఆ ప్రకారమే ఛార్జీలను వసూలు చేయాలని, అందులో పేర్కొనని అవసరాలకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హెల్త్ ఇన్సూరెన్సు లాంటివాటిని ప్రైవేటు ఆసుపత్రులు పరిగణనలోకి తీసుకోవడంలేదని, చికిత్స చేయడానికి నిరాకరిస్తున్నాయంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు రావడాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ ఈ స్పష్టత ఇచ్చారు.