గుడ్‌న్యూస్: జీతాలు పెరుగుతున్నాయి.. కానీ..!

by Anukaran |   ( Updated:2021-03-22 13:05:35.0  )
government employees, PRC statement
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 30శాతం ఫిట్ మెంట్ తో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. గతంలో ఇచ్చిన 43 శాతం ఫిట్​మెంట్​కంటే ఈ సారి ఎక్కువగా పెరుగుతున్నాయి. కనిష్టంగా రూ.3,500 నుంచి రూ. 4వేల వరకు పెరిగింది. దీనితో పాటు డీఏ కూడా కలిసి వస్తోంది. ఫలితంగా కనీస వేతనం రూ.20 వేలు దాటుతోంది. అయితే బేసిక్​వేతనం పెరుగుతున్నా… అలవెన్స్​కొంత మేరకు తగ్గుతోంది. ఉద్యోగులకు వేతన సవరణ జరగడంతో పీఆర్సీపై లెక్కలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.1‌‌0వేల కోట్ల మేర భారంపడనుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఒక్కో ఉద్యోగికి ఎంత మేర పెరుగుతుందనే లెక్కలు కూడా దాదాపుగా తేల్చారు. దీంతో కనీసం వేతనం రూ.20,851 నుంచి మొదలుకానుంది. ఇక గరిష్టంగా రూ.1.78 లక్షలకు చేరుతోంది.

ప్రస్తుతం ఫిట్​మెంట్​తో పాటు డీఏ కూడా ఉద్యోగుల వేతనంలో జమ కానుంది. 2018 జూలైలో డీఏ 30.392 శాతం కలుపుకుని వేతన సవరణ చేశారు. ఈ లెక్కన ఉద్యోగులకు ఒకేసారి రూ.ఏడువేల వరకు జీతాలు పెరగనున్నాయి. ఒక ఉద్యోగి కనీస వేతనం రూ.13వేలు అనుకుంటే డీఏ 30.392 శాతం కలుపుకుంటే రూ.3,951, ఫిట్​మెంట్​30 శాతం రూ.3,900 వేతనంలో జమ కానుంది. దీంతో సదరు ఉద్యోగి కనీస వేతనం రూ. 20,851కి చేరుతోంది. ఇలా గరిష్టంగా సీనియర్​ఉద్యోగి బేసిక్​పే రూ. 1,10,850గా ఉంటే డీఏ రూ.33,690తో పాటు 30 శాతం ఫిట్​మెంట్​రూ.33,255 చొప్పున కలవనుంది. దీంతో గరిష్ట వేతనం రూ.1,77,795కు చేరబోతుంది.

తగ్గనున్న అలవెన్స్‌లు

ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో బేసిక్ పే​లో ఫిట్​మెంట్​తో పాటు డీఏ కలుపుకుని 60 శాతం మేరకు పెరుగుతున్నాయి. ఈ లెక్కన రూ.13వేల వేతనం ఉంటే డీఏను విలీనం చేయడంతో రూ.20వేలకు చేరుతోంది. కానీ గతంలో బేసిక్ వేతనం​మీద ఇచ్చే 40 శాతం డీఏ, 30శాతం హెచ్ఆర్ఏ ఈసారి తగ్గనుంది. అలవెన్స్ దాదాపు 30శాతం మేర తగ్గనుందని అంచనా వేస్తున్నారు. డీఏను బేసిక్​లో మెర్జ్​చేయడంతో… కొత్త బేసిక్ పే​ప్రకారం డీఏ పర్సంటేజీ తగ్గుతుంది.

అయితే, కొత్త జీతాన్ని బట్టి ఇకపైన అందుకునే డీఏ మాత్రం గతంలో ఉన్నదానికంటే తక్కువగానే ఉంటుంది. వారి వేతనం శ్లాబ్‌లో తేడా రావడమే ఇందుకు కారణం. అంతేకాకుండా హెచ్ఆర్ఏను కూడా తగ్గించారు. హైదరాబాద్​లోనే 24 శాతానికి తగ్గిస్తున్నారు. దీని ప్రకారం బేసిక్​వేతనం పెరుగుతున్నా… అలవెన్స్​ మాత్రం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. కింది పేర్కొన్న పట్టికలో కొన్ని వేతన శ్లాబ్‌లు మాత్రమే.. ఇంకా సుమారు 60 రకాల శ్లాబ్‌లు ఉన్నా వాటిని పేర్కొనలేదు.

వేతనాలు పెంపు ఇలా..(రూపాయల్లో)

బేసిక్​పే (కనీస వేతనం) డీఏ (30.392శాతం) ఫిట్​మెంట్(30శాతం) మొత్తం
13,000 3,951 3,900 20,851
14,170 4,307 4,251 22,728
15030 4,568 4,509 24,107
16400 4,984 4,920 26,304
17,380 5,282 5,214 27,876
18,400 5,592 5,520 29,512
20,050 6,094 6,015 32,159
25,140 7,641 7,542 40,323
30,580 9,294 9,174 49,048
35,120 10,674 10,536 56,330
40,270 12,239 12,081 64,590
46,060 13,999 13,818 73,877
51,230 15,570 15,369 82,169
55,410 16,840 16,623 88,873
61,450 18,676 18,435 98,561
71,510 21,733 21,453 1,14,696
80,930 24,596 24,27 1,29,805
84,970 25,824 25,491 1,36,285
89,290 27,137 26,787 1,43,214
91,450 27,793 27,435 1,46,678
1,00,770 30,626 30,231 1,61,627
1,05,810 32,158 31,743 1,69,711
1,10,850 33,690 33,255 1,77,795
Advertisement

Next Story

Most Viewed