- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సండే రూ.2వేల కోట్ల నష్టం..!
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ (కోవిడ్-19) దెబ్బకు తెలంగాణ ఆదివారం ఒక్క రోజే రూ.2000 కోట్లు నష్టపోనుంది. కరోనా కట్టడికి ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఈ సంపద రాష్ట్రం కోల్పోనుంది. అదేంటి రూ.2000 కోట్లేంటి తెలంగాణ నష్టపోవడమేంటి అనుకుంటున్నారా…అవును ఆదివారం జనతాకర్ఫూ నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ జిల్లాల్లో 24 గంటలు ప్రజలు ఇళ్లకే పరిమితమవనున్నారు. తొలుత ప్రధాని మోడీ ఆదివారం కొన్ని గంటలపాటే జనతా కర్ఫ్యూ ప్రకటించగా, దీన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు పొడిగించారు. దీంతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది. ప్రభుత్వ, ప్రైవేటు, చిరుద్యోగులు అందరూ ఇళ్లకే పరిమితమవనుండటంతో రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) పూర్తిగా నిలిచిపోనుంది. తెలంగాణ రాష్ట్ర జీడీపీ రూ.9 లక్షల కోట్లలో 66 శాతం సర్వీసులు, 18 శాతం వ్యవసాయం, 16 శాతం తయారీ రంగం వాటాలున్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాలతో ముడిపడి ఉన్న వ్యవసాయం కేవలం 18 శాతం మాత్రమే. కర్ఫ్యూ వల్ల ఈ రంగం పెద్దగా ప్రభావితమవకపోయిన్నప్పటికీ రాష్ట్ర జీడీపీలో సింహ భాగం వాటాలు కలిగిన ద్వితీయ, తృతీయ రంగాలైన తయారీ, సేవల రంగాలు పూర్తిగా ప్రభావితమవనున్నాయి. రాష్ట్ర ఒక్క రోజు జీడీపీ రూ.2650 కోట్లలో దాదాపు రూ.2000కోట్ల విలువ కలిగిన వస్తు, సేవల ఉత్పత్తి ఆగిపోనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా ఆదివారం గణనీయంగా ఎఫెక్టవనుంది.
నిర్మనుష్యంగా మారనున్న హైదరాబాద్..
తెలంగాణ రాష్ట్రంలో సేవా రంగానికి కేంద్రంగా హైదరాబాద్ నగరం ఉంది. ఈ ఒక్క నగరమే రాష్ట్ర జీఎస్‌డీపీలో సగం వాటా కలిగి ఉంది. నగరంలో ప్రధానంగా తయారీ, సేవల రంగం నుంచి జీఎస్‌డీపీ వస్తోంది. కరోనా వ్యాప్తి భయంతో ఆదివారం నిర్వహించనున్న 24 గంటల జనతా కర్ఫ్యూ వల్ల హైదరాబాద్ నగరం పూర్తిగా స్తంభించి పోనుంది. హైదరాబాద్‌లో ప్రజా రవాణా ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్ల ద్వారా జరుగుతోంది. వీటన్నింటిని ఆదివారం 99 శాతం ప్రభుత్వమే నిలిపివేస్తుండటంతో సిటీ నిర్మనుష్యంగా మారనుంది. ప్రజలెవరూ బయటికి వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు, ఆటోలు, క్యాబ్‌లు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లన్నింటిని నిలిపివేస్తుండటం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తో పాటు నగరంలోని ఇతర రైల్వేస్టేషన్లు బోసిపోయే అవకాశం ఉంది. ఇక నగరంలో ఉన్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఇప్పటికే విమానాల రాకపోకలు లేకపోవడం, అంతర్జాతీయ విమాన సర్వీసులనూ ఈ రాత్రి నుంచి రద్దు చేస్తుండటంతో ఎయిర్ పోర్టు కూడా ప్రయాణికుల్లేక వెలవెలబోనుంది.
Tags: telangana, corona, gdp, janatha curfew