- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అత్యవసర సమావేశం
దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం మంజూరైన పోస్టులను, అందులో పనిచేస్తున్న ఉద్యోగులను జిల్లా, జోనల్, మల్టీజోనల్ ప్రకారం కేటాయింపు చేయడంలో అన్యాయం జరగొద్దని, సీనియారిటీని కాపాడాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఉద్యోగుల కేటాయింపులో పూర్తి పారదర్శకతను పాటించాలని, వారికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆయా విభాగాలో హెచ్ఓడీలదేనని సంఘం అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యానారాయణ విజ్ఞప్తి చేశారు. టీజీవో భవన్‌లో శుక్రవారం జరిగిన అత్యావసర సమావేశంలో కొత్త జోనల్ వ్యవస్థ, ఉద్యోగుల కేటాయింపు అంశంపై విస్తృతంగా చర్చ జరిగిన తర్వాత పై విధంగా స్పందించారు. ఉద్యోగులకు ఉన్న అపోహలను, అనుమానాలను, ఆందోళనను నివృత్తి చేసి దానికి అనుగుణంగా కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం కేటాయింపు చేయాలని కోరారు.
రాష్ట్రం ఏర్పాటు డిమాండ్లలో నియామకాల అంశం కూడా ముఖ్యమైనదని, కొత్త జోనల్ సిస్టమ్ ప్రకారం పారదర్శకమైన పద్ధతిలో ఉద్యోగుల కేటాయింపు జరగడం ద్వారా మాత్రమే ఎన్ని ఖాళీలు ఉన్నాయో తేలుతుందని, దాని తర్వాత ఉద్యోగ నియామకాలను చేపట్టడం సాధ్యమవుతుందని, నిరుద్యోగ యువత ఆకాంక్షలు నెరవేరుతాయని, వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన అవకాశాలు లభిస్తాయని అన్నారు. తెలంగాణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు లభించాలని ముఖ్యమంత్రి భావించినందువల్లనే కొత్త జోనల్ సిస్టమ్ సాకారమైందని, సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల కేటాయింపు కూడా పారదర్శకంగా, సంతృప్తికరంగా జరగాలని కోరారు.