రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: నాసిరకం విత్తనాలతో నష్టపోయిన రైతులకు రూ.25వేల పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతుసంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన చేశారు. రాష్ట్రంలో 4.70లక్షల ఎకరాల్లో సోయా విత్తనాలను సాగుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే సబ్బిడీ ధరకు ప్రభుత్వం అమ్మిన విత్తనాలు మొలకెత్తలేదని, తిరిగి విత్తనాలను కొనుగోలు చేయాలంటే ప్రైవేటు కంపెనీల వద్ద ఒక సంచి సోయా విత్తనాల ధర రూ.2500 ఉందని తెలిపారు. ఆదిలాబాద్, తాంసీ, భీంపూర్ , పలమడుగులో 10శాతం విత్తనాలు కూడా మొలకెత్తలేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed