- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘తెలంగాణ దేవుడు’ చిత్రంలో కేసీఆర్ పాత్ర అద్భుతం : మహమూద్ అలీ
దిశ, సినిమా : ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘తెలంగాణ దేవుడు’ చిత్రం ప్రీమియర్ షోను హీరో శ్రీకాంత్‌తో కలిసి వీక్షించారు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రి శ్రీనివాస్ గౌడ్. 1969-2014 వరకు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహనీయుడి జీవితాన్ని అధ్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు మహమూద్ అలీ. సినిమాలో పాత్రలన్నీ బాగున్నాయని, ఉద్యమ సమయంలో కష్టపడిన ప్రతీ ఒక్కరి పాత్రను గొప్పగా చూపించారని చెప్పారు.
అలాగే సన్నివేశాలు ఆకట్టుకున్నాయని చెబుతూ.. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నవారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో శ్రీకాంత్ ఉద్యమనాయకుడి పాత్రను పోషించగా జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం కాబోతున్నారు. త్వరలోనే థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.