తెలంగాణలో ప్రస్తుతం కేసులెన్నంటే?

by Anukaran |   ( Updated:2020-08-24 23:26:20.0  )
తెలంగాణలో ప్రస్తుతం కేసులెన్నంటే?
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడంలేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏ మాత్రం కూడా కొలిక్కి రావడంలేదు. మంగళవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,579 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదైన సంఖ్య 1,08,670కు చేరుకుంది. ఇందులో 84,163 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 23,737 మంది బాధితులు కరోనాతో ఇంకా పోరాడుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 770 మంది మృతిచెందారు.

Advertisement

Next Story