తెలంగాణ: ఇవాళ్టి కరోనా బులెటిన్ రిలీజ్

by Anukaran |
తెలంగాణ: ఇవాళ్టి కరోనా బులెటిన్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు. గత రెండు మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య 2 వేలకు పైగా నమోదవుతోంది. వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,751 కొత్త కేసులు నమోదయ్యాయి. 9 మంది మృతిచెందారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య లక్షా 20,126కి చేరింది. ఇందులో 89,350 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. 30,008 మంది బాధితులు ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 808 మంది బాధితులు కరోనాతో మృతిచెందారు. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్-432, రంగారెడ్డి-185, మేడ్చల్ -128 కొత్త కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story