కేబినెట్ మీటింగ్ ప్రారంభం.. లాక్‌డౌన్‌పై ఉత్కంఠ

by Anukaran |   ( Updated:2021-05-11 03:09:42.0  )
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా ఉధృతి, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్​ నేతృత్వంలో మంత్రిమండలి భేటీ అయింది. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్​ పెట్టాలని వైద్యరంగంతో పాటు పలు వర్గాల నుంచి డిమాండ్​ రావడంతో.. మరో రెండు వారాల పాటు తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ, లాక్‎డౌన్​ అవసరం లేదంటూ సీఎం కేసీఆర్​, సీఎస్ సోమేశ్​ కుమార్​ పలుమార్లు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా ప్రభుత్వానికి డెడ్​లైన్​ విధించింది. ప్రభుత్వం వైఖరిపై నేటి విచారణలో అక్షింతలు వేయడంతో లాక్‌డౌన్‌ అంశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పరిణామాలతో సీఎం కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది

Advertisement

Next Story

Most Viewed