- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తగ్గిన జీఎస్‌డీపీ వృద్ధి రేటు
దిశ, న్యూస్ బ్యూరో: ఆర్థిక నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం అద్భుత ఫలితాలు సాధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గర్వంగా చెప్పుకుంటున్నా అనేక ఆర్థిక అంశాలు ఆ దిశగా కనిపించడం లేదు. స్వీయ ఆర్థిక వనరుల వృద్ధి రేటు సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. రాష్ట్ర మొత్తం జీఎస్‌డీపీ 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8,65,688 కోట్లు ఉండగా 2019-20 నాటికి అది రూ. 9,69,604 కోట్లకు చేరుకుంది. గతేడాది వృద్ధి రేటు 14.3% కాగా ఈసారి అది 12.6%కి పడిపోయింది. జాతీయ స్థాయిలో 11.2% నుంచి 7.5%కి పడిపోయినట్లు మంత్రి హరీశ్‌రావు తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా దేశవ్యాప్తంగా జీడీపీ పడిపోతున్నా రాష్ట్రంలో మాత్రం అంత ఘోరంగా పడిపోకుండా ఉన్నంతలో స్థిరత్వాన్ని సాధించిందని మంత్రి పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే తగ్గినా నిరాశ చెందలేదని, ఇంకా డబుల్ డిజిట్‌లోనే ఉందన్నారు.
tags: Telangana, Budget, GSDP, Growth Rate, Decline