ఎస్‌ఈసీ ఎదుట బీజేపీ నేతల ధర్నా

by Shyam |   ( Updated:2020-11-30 11:19:51.0  )
ఎస్‌ఈసీ ఎదుట బీజేపీ నేతల ధర్నా
X

దిశ, క్రైమ్ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతల ఇండ్లపై పోలీసులు దాడులు చేయడాన్ని నిరసిస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. పోలీసులు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహారిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పట్ల పోలీసులు కక్ష్యపూరితంగా ప్రవర్తిస్తున్నారన్నారు. నగరంలోని ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు.

Advertisement

Next Story