త్వరలో రాజగోపాల్ రెడ్డిని కలుస్తాం :బండి సంజయ్

by Anukaran |   ( Updated:2021-01-01 02:11:15.0  )
త్వరలో రాజగోపాల్ రెడ్డిని కలుస్తాం :బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సిద్ధాంతాలతో కలిసి పనిచేయగలిగిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని.. త్వరలో ఆయన్ను కలుస్తామని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం గవర్నర్ తమిళసైని బీజేపీ నేతల బృందం కలిసింది. కొత్తగా గెలిచిన కార్పొరేటర్లను గుర్తిస్తూ గెజిట్ విడుదల చేసేలా ఎస్ఈసీని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిన కార్పొరేటర్లు శంకుస్థాపనలు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లను అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని తెలిపారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, 25 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలి కాబట్టి వారిని పక్కన పెడుతున్నామని తెలిపారు.

Advertisement

Next Story