బ్రేకింగ్.. 120 ఎకరాల సీలింగ్ భూమిపై కన్నేసిన తెలంగాణ బీజేపీ నేత.. గ్రామస్తుల ఆందోళన

by Anukaran |
land
X

దిశ, స్టేషన్ ఘన్ పూర్ : భూమి లేని నిరుపేదలకు, గొల్ల కురుమలకు ప్రభుత్వం ఇచ్చిన సీలింగ్ భూమిని బీజేపీ రాష్ట్ర నాయకుడు కాజేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మా భూమి మాకు ఇప్పించాలని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం వెంకటాపూర్ గ్రామస్థులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యకు వినతి పత్రం అందించారు.

rajaiah

వివరాల్లోకి వెళితే.. అయినవోలు మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో సర్వే నంబర్ 324, 324/ ఏ, 324 ఎఫ్ నుంచి ఎనిమిది సర్వే నంబర్లలో 350 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే అందులో 120 ఎకరాలు గొల్ల కురుమలకు, దళితులకు ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిని ఆనుకొని ఉన్న వ్యవసాయ భూమిని బీజేపీ రాష్ట్ర నాయకుడు మాదాసి వెంకటేష్ కొనుగోలు చేశారు. అయితే, పార్టీని అడ్డంపెట్టుకుని ప్రభుత్వం కేటాయించిన 120 ఎకరాల సీలింగ్ భూమిని ఆక్రమించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. అతడి నుంచి వారి భూములు కాపాడి తమకు ఇప్పించాలని వెంకటాపురం గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed