జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

by Shyam |
జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు ప్రభుత్వం ఐదు సవరణలు చేయగా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లును మంత్రి కేటీఆర్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టి స‌భ్యుల అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. అనంత‌రం బిల్లును ఆమోదిస్తున్న‌ట్లు స్పీక‌ర్ పోచారం ప్రకటించారు.

5 ఐదు స‌వ‌ర‌ణ‌లు…

1. జీహెచ్ఎంసీలో మ‌హిళ‌ల‌కు 50శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పిస్తూ స‌భ ఆమోదం తెలిపింది. మ‌హిళా సాధికార‌త‌కు పెద్ద‌పీట వేయాల‌నే ఆలోచ‌న‌తో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌కు ఇవాళ చ‌ట్టం చేసుకుంటున్నామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. గ‌త ఎన్నిక‌ల్లో 79స్థానాల్లో మ‌హిళ‌ల‌ను గెలిపించిన చ‌రిత్ర టీఆర్ఎస్ పార్టీకే ద‌క్కుతుంద‌న్నారు. బీసీల రిజ‌ర్వేష‌న్లు య‌ధాత‌థంగా కొన‌సాగుతాయ‌న్నారు.

2. గ‌తంలో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 2.5శాతం ఉన్న గ్రీన్ బ‌డ్జెట్‌ను 10శాతానికి పెంచుతున్న‌ట్లు తెలిపారు. పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్ చ‌ట్టంలో 10శాతం బ‌డ్జెట్‌ను గ్రీన్ క‌వ‌ర్‌కు కేటాయించామ‌న్నారు.

3. జీహెచ్ఎంసీలో 10 ఏళ్ల‌కోసారి రిజ‌ర్వేష‌న్ల మార్పున‌కు స‌భ ఆమోదం తెలిపింది. రెండు ట‌ర్మ్‌లు ఒకే రిజ‌ర్వేష‌న్ ఉండేలా పంచాయ‌తీరాజ్‌, పుర‌పాల‌క చ‌ట్టంలో తీసుకువ‌చ్చాం. అదే పాల‌సీని జీహెచ్ఎంసీ యాక్ట్‌లో చేర్చ‌తున్నామ‌ని మంత్రి తెలిపారు.

4. నాలుగు ర‌కాల వార్డు వాలంటీర్ల క‌మిటీల ఏర్పాటుకు స‌భ ఆమోదం తెలిపింది. ఈ క‌మిటీల్లో 50శాతం మ‌హిళ‌లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు. రాజ‌కీయాల‌కు అతీతంగా వార్డు క‌మిటీల ఏర్పాటు ఉంటుంద‌న్నారు. యూత్ క‌మిటీ, మ‌హిళా క‌మిటీ, సినీయ‌ర్ సిటిజెన్ క‌మిటీ, ఎమినెంట్‌ సిటిజెన్ క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

5. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌భుత్వాన్ని ఎస్ఈసీ సంప్ర‌దించాల‌ని జీహెచ్ఎంసీ చ‌ట్ట స‌వ‌ర‌ణ చేయగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed