- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ భూమి కబ్జా.. వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తహసీల్దార్
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అన్నంపెళ్లి గ్రామంలో ప్రభుత్వ భూములను కొంతమంది వ్యక్తులు కబ్జా చేస్తున్నారని పినపాక మండల తహసీల్దార్ విక్రమ్ కుమార్ అన్నారు. అన్నంపెళ్లి గ్రామంలోని సర్వే నెం. X/81 రెండు ఎకరాల ఇరవై గుంటల భూమిని కొంత మంది కబ్జాచేసి ప్లాట్లుగా మార్చి అమ్మాలని చూస్తున్నారని ఆయన తెలిపారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ దూరిశెట్టి అనుదీప్ ఆదేశాల మేరకు సర్వే నెం.ఎక్స్ బై 81 ప్రభుత్వ భూమిని స్వాధీన పరుచుకొని ఫెన్సింగ్ వేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని గానీ, ప్రభుత్వ భూములను గానీ దుర్వినియోగం చేస్తే ఎంతటివారైనా విడిచి పెట్టేది లేదన్నారు. భూకబ్జాలు, వెంచర్లు, ప్లాట్లు చేసి అమ్మిన వారిపై కఠినమైన చర్యలు తీసుకొని అట్టి వారిని వదిలిపెట్టే సమస్యే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేయడం, ప్రభుత్వ భూములను కాపాడటమే నా లక్ష్యమన్నారు. అనంతరం అన్నంపెళ్లి గ్రామంలోని సర్వే నెం.ఎక్స్ బై 81లో ఉన్న ప్రభుత్వ భూమిలో రెవిన్యూ సిబ్బందితో కలిసి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూములను కాపాడిన తహసీల్దార్ విక్రమ్ కుమార్‌ను పలువురు నాయకులు, గ్రామస్తులు అభినందించారు.