- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ,వెబ్ డెస్క్ : తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నల్గొండ వరంగల్ నియోజక వర్గంలో ఇప్పటి వరకు రెండు రౌండ్ల ఫలితాలు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 31,987 ఓట్లు రాగా. రెండో స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కి 24,116 ఓట్లు పోలయ్యాయి. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం 18,528 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి 13,284 ఓట్లతో నాలుగు స్థానంలో నిలిచారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ 7,598 ఓట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 3,787 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఐతే ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌కు షాకిచ్చారు. పల్లా రాజేశ్వర్ తర్వాత ఆయన రెండో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే అందులో టీజేఎస్ అధినేత కోదండరాంను దాటుకుని ఇండిపెడెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండోస్థానంలో ఉండటం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.