తీన్మార్ మల్లన్న అరెస్టు అప్రజాస్వామికం

by Shyam |   ( Updated:2021-08-28 07:31:01.0  )
mallann
X

దిశ,ములుగు : తెలంగాణలో పేద ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు, సీనియర్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను అరెస్టుచేయడం అప్రజాస్వామికమనీ, ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ములుగు, భూపాలపల్లి జిల్లా కన్వీనర్లు మొగుళ్ల భద్రయ్య, కౌటం రవిపటేల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యమాలతో, పోరాటాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పోరాటాలను, ఉద్యమాలను, ప్రశ్నించే గొంతులను అణిచివేయడం, ఆనాటి ఉద్యమకారుడిగా ఉన్న నేటి ప్రభుత్వ అధిపతి నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు.

నిన్నటికి నిన్న ఓ రాష్ట్ర మంత్రి తొడలు గొడుతూ మాట్లాడిన పద్దతి రాష్ట్రంలో ఎలాంటి పాలన జరుగుతుందో యావత్తు ప్రజానీకం గమనిస్తున్నారని అన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసుశాఖ అవినీతి, అక్రమాలను నిలదీస్తూ ,పేద ప్రజల కోసం ఉద్యమిస్తున్న తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయడం సబబు కాదని తెలిపారు. రాష్ట్ర కన్వీనర్ దాసరి భూమయ్య,రాష్ట్ర కోకన్వీనర్ రజినికుమార్ గార్ల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి జిల్లా కోకన్వీనర్ శేఖర్ నాని, ములుగు జిల్లా కోకన్వీనర్ అచ్చునూరి కిషన్, ములుగు మండల కన్వీనర్ పోరిక రాహుల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story