- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థరూర్ ఇంగ్లిష్‌కు టీనేజర్ చెక్!
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఏదైనా ట్వీట్ చేసినా లేదా ఏదైనా కార్యక్రమంలో మాట్లాడినా, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ పట్టుకుని వెళ్తే కానీ, ఆయన వాడే ఇంగ్లిష్ పదాలు అర్థంకావని అంటుంటారు. నాలుకను మెలిపెట్టే పెద్ద పెద్ద పదాలను సందర్భోచితంగా ఉపయోగించి, తర్వాత వాటి అర్థాన్ని చక్కగా వివరించగలగడంలో ఆయన నేర్పరి. ఆయనకు తెలియని పదాలు ఉంటాయా? అనేంతగా ఆయన ఇంగ్లిష్ ప్రావీణ్యం ఉండేది. ఇక్కడ ‘ఉంటుంది’ అనకుండా ‘ఉండేది’ అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, శశిథరూర్‌కు తెలియని పదాన్ని కేరళకు చెందిన ఓ టీనేజర్ ఉచ్ఛరించి, ఆయన ప్రావీణ్యానికి ఇటీవల చెక్ పెట్టేసింది. ఇడుక్కి ప్రాంతానికి చెందిన పదో తరగతి చదివే దియా, శశిథరూర్‌కు తెలియని ఓ పదాన్ని ఫేస్‌బుక్ ద్వారా మెసేజ్ చేసి, దాన్ని పలకాలని కోరింది. అది ఆయన వల్ల కాలేదు. అందుకే ఓ ఎఫ్‌ఎం చానల్ ద్వారా థరూర్, దియాను వర్చువల్‌గా కలిసి, ఆ పదాన్ని ఎలా పలకాలో అడిగి తెలుసుకున్నారు.
క్లబ్ ఎఫ్‌ఎం ద్వారా జూమ్ కాల్‌లో థరూర్, దియాతో మాట్లాడారు. ఫేస్‌బుక్‌లో ఆమె పంపిన పదాన్ని ఎలా పలకాలో తెలుసుకుని, ఆమె ముందు ఓటమి అంగీకరిస్తున్నట్లుగా చెప్పారు. అంతేగాకుండా దియా ఆ పదాన్ని పలికిన తర్వాత దాని అర్థం ఏంటని థరూర్ అడిగారు. అది ఒక ఆహార పదార్థం పేరు అని దియా, ఆయనకు సమాధానం ఇచ్చింది. ఇలాంటి పెద్ద పదాలు నేర్చుకోవాలంటే చాలా జ్ఞాపకశక్తి ఉండాలని, వాటిని ఏకధాటిలో పలకాలంటే ఏకాగ్రత అవసరమని, అవి రెండూ దియాకు పుష్కలంగా ఉన్నాయని శశిథరూర్ ఆమెను ప్రశంసించారు. ఈ మొత్తం జూమ్ కాల్ వీడియోను క్లబ్ ఎఫ్ఎం తమ ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. ఆ పోస్ట్‌ను శశిథరూర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.