28 గంటల ప్లేబ్యాక్‌ టైంతో Zebronics ఇయర్‌బడ్స్ లాంచ్

by Harish |
28 గంటల ప్లేబ్యాక్‌ టైంతో Zebronics ఇయర్‌బడ్స్ లాంచ్
X

దిశ, వెబ్‌డెస్క్: Zebronics కంపెనీ కొత్తగా ‘Zeb Pods-1’ ఇయర్‌బడ్‌లను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ TWS ఇయర్‌ఫోన్‌లు అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ధర రూ. 1,499. కొనుగోలు సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ. 250 తగ్గింపు, అలాగే 5 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు.




ఇయర్‌బడ్‌లు 13mm డ్రైవర్లను కలిగి ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి వాయిస్ అసిస్టెంట్‌లకు కూడా సపోర్ట్ చేస్తాయి. బ్లూటూత్ v5.2 కనెక్టివిటీని కలిగి ఉంది. కాల్స్‌తో పాటు అన్ని సమయాల్లో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను రద్దు చేసే అధునాతన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌ను అందించారు. గేమింగ్ మోడ్‌లో సౌంగ్ క్వాలిటీ బాగా ఉంటుందని కంపెనీ తెలిపింది టైప్-C చార్జింగ్ పోర్ట్‌ కూడా ఉంది. బ్యాటరీ లైఫ్ ANC లేకుండా 28 గంటలు, ANC తో 22 గంటల వరకు ప్లేబ్యాక్ టైం వస్తుందని కంపెనీ పేర్కొంది. మ్యూజిక్, కాల్స్‌ కోసం టచ్ కంట్రోల్ సిస్టం కూడా ఉంది.

Advertisement

Next Story