ఎండాకాలంలో ఫోన్ ఛార్జింగ్ స్లో అవుతుంది.. దీనికి కారణం ఏంటంటే ?

by Sumithra |
ఎండాకాలంలో ఫోన్ ఛార్జింగ్ స్లో అవుతుంది.. దీనికి కారణం ఏంటంటే ?
X

దిశ, ఫీచర్స్ : వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మండిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. మనుషులు, పశుపక్షాదులే కాదు ఏ ఎండలకు ఫోన్లు కూడా వేడెక్కిపోతున్నాయి. ఫోన్ మాట్లాడినా, వీడియోలు చూసినా, కెమెరాలను వినియోగించినా, ఆటలు ఆడినా కొన్ని నిమిషాల్లోనే ఫోన్ తెగ హీటెక్కిపోతుంది. అలాగే ఈ ఏండాకాలం ఫోన్ చార్జింగ్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే మిగిలిన రెండు సీజన్లలో కంటే ఈ వేసవిలో ఫోన్ నెమ్మదిగా చార్జింగ్ అవుతుంది. అయితే ఎండలకు, ఫోన్ చార్జింగ్ లకు ఎలాంటి సంబంధం ఉంది. వేసవిలో ఫోన్ బ్యాటరీ ఎందుకు స్లోగా చార్జ్ అవుతుంది, దీనికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా మనం వాడే స్మార్ట్ ఫోన్లు డిఫెన్స్ మెకానిజంతో పనిచేస్తాయి. కొత్త కొత్తగా రూపుదిద్దుకుంటున్న స్మార్ట్ ఫోన్లు ఎలాగైతే పెర్ఫార్మెన్స్ ను పెంచుకుంటుందో అలాగే ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్ కూడా పెరిగిపోయింది. దాంతో ఎంత ఎంహెచ్ బ్యాటరీ అయినా నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది.

డిస్ ప్లే, పెర్ఫార్మెన్స్, మిగిలిన ఫీచర్లలో స్మార్ట్ ఫోన్లు ఎంతగా అప్డేట్ అవుతున్నాయో అవి ఫోన్ల హీట్ కి కారణాలవుతున్నాయి. ఇక ఫోన్లలో ఆటల విషయానికొస్తే పిల్లలు నుంచి మొదలుకుని పెద్దల వరకు హై ఎండ్ గేమ్స్ ఆడడంతో ఫోన్ చాలా వేడెక్కిపోతుంది. ఈ అన్ని కారణాలతో వేసవికాలంలో ఫోన్లు మామూలు రోజుల్లో కంటే కూడా ఎక్కువగా హీట్ ఎక్కుతుంది. ఈ వేడి ఇలా ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే ఆ వేడికి ఫోన్ పేలిపోయే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. అందుకే డిఫెన్స్ మెకానిజంని ఫోన్ లో డెవలప్ చేస్తారు.

ఫోన్ బాగా వేడెక్కినప్పుడు దాన్ని ఫోన్ సెన్సార్లు గుర్తిస్తాయి. ఫోన్ ఛార్జింగ్ వేగాన్ని ఈ సెన్సార్లు తగ్గిస్తాయి. ఫోన్ వేడి కాస్త తగ్గగానే ఛార్జింగ్ త్వరగా ఎక్కుతుంది. మరికొన్నిసార్లు ఫోన్ వేడి పూర్తిగా తగ్గేంతవరకు కూడా ఫోన్ ఛార్జింగ్ పూర్తిగా ఎక్కదు. ఇలాంటప్పుడు ఫోన్ బ్యాక్ కేస్ తీసేయాలంటున్నారు నిపుణులు. ఇలాంటప్పుడు వైర్ లెస్ ఛార్జింగ్ కంటే వైర్ ఛార్జింగ్ పెట్టడమే మంచిది.

Advertisement

Next Story

Most Viewed