WhatsApp: భారీ సంఖ్యలో ఖాతాలను తొలగించిన వాట్సాప్

by Maddikunta Saikiran |
WhatsApp: భారీ సంఖ్యలో ఖాతాలను తొలగించిన వాట్సాప్
X

దిశ, వెబ్‌డెస్క్: మెటా(Meta)కు చెందిన పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం యాప్ వాట్సాప్(WhatsApp)ను మన దేశంలో కోట్లాది మంది వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో గత కొంత కాలంగా సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూజర్లకు ప్రైవసీ ఇంప్రూవ్ చేయడంపై వాట్సాప్ ఎక్కువ ఫోకస్‌ చేస్తోంది. ఈ మేరకు ఫేక్‌ వార్తలు(Fake news), తప్పుడు సమాచార వ్యాప్తి(Misinformation)ని నిరోధించేందుకు భారీ సంఖ్యలో ఖాతాలపై నిషేధం విధించింది. ఒక్క ఆగస్టు నెలలోనే 80 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్‌ చేశామని వాట్సాప్ తన నెలవారీ నివేదికలో పేర్కొంది. భారత ఐటీ రూల్స్ 2021(Indian IT Rules 2021)కి అనుగుణంగానే ఈ చర్యలు తీసుకున్నామని ప్రకటించింది. ఆగస్టు నెలలో గ్రీవెన్స్ ఛానెల్(Grievance Channel) ద్వారా యూజర్ల నుంచి 10,707 కంప్లైంట్లు అందాయని, దీంతో తక్షణమే స్పందించి చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. కాగా కొత్త IT రూల్స్ 2021 ప్రకారం 50 లక్షల కంటే ఎక్కువ యూజర్ బేస్ ఉన్న సోషల్ మీడియా యాప్(Social Media Apps)లు ప్రతి నెల వివరణాత్మక నివేదికలను పంచుకోవాలి. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టి, ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో వెల్లడించాలి. వాట్సాప్(WhatsApp)కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల మంది యూజర్లున్నారు.

Advertisement

Next Story

Most Viewed