WhatsApp సరికొత్త ఫీచర్.. ఒకే యాప్‌లో రెండు ఫోన్ నంబర్స్ వాడొచ్చు!

by Harish |   ( Updated:2023-06-17 06:16:43.0  )
WhatsApp సరికొత్త ఫీచర్.. ఒకే యాప్‌లో రెండు ఫోన్ నంబర్స్ వాడొచ్చు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ప్రతి ఒక్కరు దాదాపు రెండు మొబైల్ నెంబర్లను కలిగి ఉంటున్నారు. ఈ రెండింటికి కూడా వాట్సాప్ క్రియేట్ చేసుకుని సపరేట్‌గా వాడుకుంటున్నారు. అయితే ఒక ఫోన్‌లో ఒక నంబర్‌ ద్వారా మాత్రమే వాట్సాప్ వాడటానికి అవకాశం ఉంటుంది. రెండు అకౌంట్లను ఒకే యాప్‌లో వాడటం కుదరదు. అందుకే చాలా మంది యూజర్లు బిజినెస్ యాప్ లేదా డూప్లికేట్(క్లోనింగ్ యాప్)‌ను థర్డ్ పార్టీల ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని రెండో నంబర్‌పై ఉన్న వాట్సాప్ అకౌంట్‌ను అదే ఫోన్‌లో వాడుతుంటారు. అయితే చాలా కాలంగా యూజర్లు ఒకే యాప్‌లో వేరు వేరు అకౌంట్లను వాడుకునేలా ఆప్షన్ అందించాలని కంపెనీని కోరుతున్నారు.

తాజాగా వాట్సాప్ ఈ సమస్యను పరిష్కరించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. దీనికోసం ఒకే యాప్‌లో వేరు వేరు అకౌంట్లను వాడుకునేలా కొత్త ఫీచర్‌ను కంపెనీ టెస్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.13.5లో ఈ ఫీచర్‌ను గుర్తించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.

‘వాట్సాప్ బిజినెస్‌ యాప్‌లో ఈ ఫీచర్ కనిపించిందని, త్వరలో మిగతా వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని WABetaInfo’ పేర్కొంది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే గనక ఒకే వాట్సాప్‌లో రెండు నంబర్లపై ఉన్న అకౌంట్లను వాడవచ్చు. కావాల్సినప్పుడు ఒకే క్లిక్‌తో వేరు వేరు అకౌంట్లకు మారవచ్చు.

ఇవి కూడా చదవండి:

గూగుల్ లెన్స్ కొత్త ఫీచర్: ఒక్క ఫొటోతో మీ స్కిన్ కండిషన్ చెప్పేస్తుంది!

WhatsApp నుంచి ఈసారి అదిరిపోయే ఫీచర్..!


Advertisement

Next Story

Most Viewed