లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్.. ఎందుకంటే..

by Harish |
లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్.. ఎందుకంటే..
X

దిశ, టెక్నాలజీ: ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ రికార్డు స్థాయిలో భారత్‌లో ఖాతాలను నిషేధించినట్లు పేర్కొంది. ఫిబ్రవరి 1-29 మధ్య కాలంలో దాదాపు 76,28,000 ఖాతాలను వాట్సాప్ బ్యాన్ చేసింది. వీటిలో 14,24,000 ఖాతాలను ముందస్తుగా వినియోగదారుల నుండి ఎటువంటి నివేదికలు రాకుండానే నిషేధించారు. IT రూల్స్, 2021కి అనుగుణంగా సోషల్ మీడియా సంస్థలు ప్రతినెలా తమ ప్లాట్‌ఫారమ్‌లో ఖాతాలపై తీసుకున్న చర్యలు, ఫిర్యాదులు, ఇతర సమీక్ష వివరాలను ప్రకటించాల్సి ఉంటుంది. వాట్సాప్ కూడా ఇప్పుడు తన నెలవారీ నివేదికను విడుదల చేసింది.

దేశంలో 50 కోట్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్ ఫిబ్రవరి నెలలో దేశంలో రికార్డు స్థాయిలో 16,618 ఫిర్యాదులను అందుకోగా వాటిలో 22 ఖాతాలపై చర్యలు తీసుకుందని పేర్కొంది. జనవరి 1-31 మధ్య, కంపెనీ 67,28,000 ఖాతాలను నిషేధించగా. వీటిలో దాదాపు 13,58,000 ఖాతాలు వినియోగదారుల నుండి ఎటువంటి నివేదికలు రాకముందే ముందస్తుగా నిషేధించబడ్డాయి. మా వినియోగదారులకు ఎప్పుడు భద్రతతో కూడిన ఫీచర్లను అందిస్తామని, దీని కోసం మా నిపుణుల బృందం కృషి చేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed