కారులో ల్యాప్‌టాప్‌నకు ఛార్జింగ్ పెట్టాలనుకుంటున్నారా.. ఈ పరికరంతో సులభం

by Sumithra |
కారులో ల్యాప్‌టాప్‌నకు ఛార్జింగ్ పెట్టాలనుకుంటున్నారా.. ఈ పరికరంతో సులభం
X

దిశ, ఫీచర్స్ : ల్యాప్‌టాప్‌లో చార్జింగ్ లేకపోతే దాన్ని ఉపయోగించడం చాలా కష్టం. ముఖ్యంగా కారులో ప్రయాణం చేస్తూ ఏదైనా పని చేసుకోవాలంటే లాప్టాప్ లో ఛార్జింగ్ అయిపోతే ఏ పని చేయలేం. కారులో ల్యాప్ టాప్ ఛార్జింగ్ పెట్టుకోవడం కూడా చాలా కష్టం. దీంతో అత్యవసర పనులను పూర్తి చేసుకోకుండా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కూడా ఇలాంటి పరిస్థితులని ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఉంటాను. అయితే అలాంటి వారి కోసమే ఓ పరికరం అందుబాటులోకి వచ్చేసింది. ఈ పరికరంతో కార్ లో మీ ఫోన్ కి మాత్రమే కాదు లాప్ టాప్ కి కూడా చార్జింగ్ పెట్టుకోవచ్చు. మరి ఆ పరికరం ఏంటి, ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

Ceptics 200 W కార్ ల్యాప్‌టాప్ ఛార్జర్

Ceptics 200 W కార్ ల్యాప్‌టాప్ ఛార్జర్. 200W పవర్‌తో ఈ ఛార్జర్ స్మార్ట్ వోల్టేజ్ టెక్నాలజీతో అందుబాటులో ఉంది. మీరు దీన్ని మీ కారుకు కనెక్ట్ చేసి మీ మొబైల్‌ తో పాటు ల్యాప్‌టాప్‌ను కూడా సులభంగా ఛార్జ్ చేయవచ్చు. ఇందులో మీరు 5 USB పోర్ట్‌లు, 2 ప్లగ్ పాయింట్‌లు అందుబాటులో ఉంటాయి. దీని ద్వారా మీరు ఐప్యాడ్, ల్యాప్‌టాప్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఛార్జ్ చేయవచ్చు. ఈ ఛార్జర్ ధర రూ. 8,999 అయినప్పటికీ, మీరు దీన్ని ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లో కేవలం రూ. 2,099కి అంటే 77 శాతం తగ్గింపు ధరతో సొంతం చేసుకోవచ్చు.

myTVS 200W కార్ ల్యాప్‌టాప్, మొబైల్ ఛార్జర్

myTVS 200W కార్ ల్యాప్‌టాప్, మొబైల్ ఛార్జర్. 200W పవర్‌తో ఈ ఛార్జర్ స్మార్ట్ వోల్టేజ్ టెక్నాలజీతో అందుబాటులో ఉంది. మీరు దీన్ని మీ కారుకు కనెక్ట్ చేసి మీ మొబైల్‌ తో పాటు ల్యాప్‌టాప్‌ను కూడా సులభంగా ఛార్జ్ చేయవచ్చు. మీరు ఈ ల్యాప్‌టాప్ ఛార్జర్‌ను అమెజాన్‌లో 14 శాతం తగ్గింపుతో కేవలం రూ. 2,594తో కొనుగోలు చేయవచ్చు. ఇది 3 ఇన్ వన్ ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్. దీన్ని మీరు 2 సంవత్సరాల వారంటీతో సొంతం చేసుకోవచ్చు.

సోలెటల్ 150W కార్ ఇన్వర్టర్

4 USB, 2 టైప్-C పోర్ట్‌లు, డ్యూయల్ 220V అవుట్‌లెట్‌లతో సోలెటల్ 150W కార్ ఇన్వర్టర్ వస్తుంది. మీరు ఈ ఛార్జర్‌ని 32 శాతం తగ్గింపుతో రూ. 1299కే సొంతం చేసుకోవచ్చు. ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ మీకు ఈ ఛార్జర్‌ను నో కాస్ట్ EMI ద్వారా కూడా అందిస్తోంది. ఇందులో నెలవారీ వాయిదా రూ.118 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story