Vivo Smart Phone: రూ. 8వేలకే అదిరిపోయే వివో స్మార్ట్ ఫోన్

by Prasanna |
Vivo Smart Phone: రూ. 8వేలకే అదిరిపోయే వివో స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్: చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ ను వివో సంస్థ భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. వివో Y78i పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను మన ముందుకు తీసుకొస్తున్నారు. దీని ధర కూడా చాలా తక్కువ.. మంచి ఫీచర్లతో డిజైన్ చేసారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. వివో వై18ఐ ఫోన్ లో 6.56 ఇంచెస్‌తో కూడిన LCD స్క్రీన్‌ను అందించారు. 90 హెర్ట్జ్‌ రీఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఇక 528 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. దీనిని సన్‌లైట్‌లో కూడా చూడొచ్చు.

ఆండ్రాయిడ్‌ 14 టచ్‌ OS 14 వెర్షన్ పై ఈ ఫోను వస్తుంది. దీనిలో 15 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 mah కెసాసిటీతో కూడిన బ్యాటరీని అమర్చారు. ఇక ధర గురించి మాట్లాడుకుంటే.. 4 GB ర్యామ్‌, 64 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,999గా నిర్ణయించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు.

కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో.. వై-ఫై5, GPS , యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించనున్నారు. మైక్రో ST కార్డ్ సాయంతో స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పెంచుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed