ట్విట్టర్ లోగోలో పిట్ట మాయం.. దాని స్థానంలో కొత్తగా ఏం వచ్చిందంటే..?

by Satheesh |   ( Updated:2023-07-24 11:04:04.0  )
ట్విట్టర్ లోగోలో పిట్ట మాయం.. దాని స్థానంలో కొత్తగా ఏం  వచ్చిందంటే..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా వేదికల్లో దిగ్గజమైన ట్విట్టర్ తన పేరు, లోగో ను ఇవాళ ఆ సంస్థ మార్చింది. ట్విట్టర్ ‘బ్లూ బర్డ్’ స్థానంలో ‘ఎక్స్’ సింబల్ ను ప్రవేశ పెట్టారు. 2006లో ట్విట్టర్ స్థాపించిన సమయం నుంచి కూడా లోగో లో మార్పులు వచ్చాయి.. కానీ బ్లూ బర్డ్ ను అలాగే ఉంచేవారు. ట్విట్టర్ లోగోగా పక్షుల కిలకిలరావాలకు గుర్తుగా ‘బర్డ్’ లోగో ఏర్పాటు చేశారు. వెబ్ సైట్ క్రియేటివ్ బ్లాగ్ కథనం ప్రకారం లైట్ బ్లూ బర్డ్ సింబల్ కోసం 15 డాలర్లు చెల్లించి లోగో తయారు చేయించారని తెలుస్తున్నది. గతేడాది అక్టోబర్‌లో ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన ఎలన్ మస్క్.. ఎవ్రీథింగ్ యాప్ కోసం ఎక్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 1999 లోనే ఎక్స్ డాట్ కామ్ సంస్థను ఎలన్ మస్క్ స్థాపించారు. ట్విట్టర్ పేరెంట్ సంస్థగా ఎక్స్ కార్పొరేషన్ పేరు కూడా ఎలన్ మస్క్ పెట్టారు. తాజాగా ట్విట్టర్ పేరు లోగో మార్పుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ‘రిప్’ ట్విట్టర్ అంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్ చేస్తున్నారు.

Advertisement

Next Story