సూర్యుడిపై పరిశోధనకు ముహూర్తం ఖరారు.. ఉపగ్రహం పేరు ఇదే!

by GSrikanth |   ( Updated:2023-08-28 10:26:29.0  )
సూర్యుడిపై పరిశోధనకు ముహూర్తం ఖరారు.. ఉపగ్రహం పేరు ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) జాబిల్లిపై పరిశోధనలకు ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక చంద్రుడిపై విజయవంతంగా దిగిన విషయం తెలిసిందే. దీంతో భారత్ నెక్ట్స్ టార్గెట్ సూర్యుడే అని స్వయంగా ప్రధాని మోడీనే ప్రకటించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని ప్రకటించి వారంరోజులు కూడా గడవకముందే సూర్యుడిపై ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. సెప్టెంబర్ 2వ తేదీన సూర్యుడి మీదకు ఆదిత్య ఎల్-1‌ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సూర్యుడిపై పరిశోధనకు భారత్ ప్రయోగించనున్న తొలి ఉపగ్రహం ఆదిత్య ఎల్-1గా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్‌-1 ను ఇస్రో ప్రయోగించనుంది.

Advertisement

Next Story