దయ్యాలతో వ్యాపారం..! రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించిన విద్యార్థులు!!

by Sumithra |
దయ్యాలతో వ్యాపారం..! రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించిన విద్యార్థులు!!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా దయ్యాల గురించి అనేక రకాల చర్చలు జరుగుతుంటాయి. కొంతమంది ప్రజలు దయ్యాలు ఉన్నాయని విశ్వసిస్తే మరికొంతమంది దయ్యాలు లేవని నమ్ముతారు. కొంతమంది ఏకంగా మేము దయ్యాలని చూశాము అని చెబుతారు. దీంతో చాలామంది కన్య్ఫూజన్ లో ఉంటారు. ఎవరి మాటలు నిజం ఎవరి మాటలు అబద్దమో తేల్చుకోలేకపోతారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలలో కొన్ని ఇండ్లని హంటెడ్ ఇండ్లుగా పరిగణిస్తారు. అలాంటి ఇండ్లలో నివసించేందుకు ప్రజలు భయాందోళనకు గురవుతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని థాయ్‌లాండ్‌కు చెందిన కొంతమంది విద్యార్థులు వినూత్న వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇంతకీ ఆ వ్యాపారం ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవానికి ఈ విద్యార్థులు ఆ 'హాంటెడ్' ఇళ్లు, అపార్ట్‌మెంట్‌లలో నిద్రపోతారు. అలాగే పారానార్మల్ మిషన్ ద్వారా ఆ ఇంట్లో దయ్యం ఉందో లేదో తెలుసుకుని నిర్ధారిస్తారు. ఆ తరువాత 'దెయ్యం లేని ఇల్లు' అని సర్టిఫికెట్ ను కూడా జారీ చేస్తారట. ఈ బిజినెస్ గురించి వింటుంటేనే చాలా ఎక్సైట్ మెంట్ గా ఉంది కదా. ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన విద్యార్థులలో 21 ఏళ్ల థాయ్ - తైవాన్, విద్యార్థి వైఫీ చెంగ్, 22 ఏళ్ల శ్రేత్‌వుట్ బూన్‌ప్రఖోంగ్ ఉన్నారు.

వ్యాపారం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది..

ఆడిటీ సెంట్రల్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం వైఫీ చెంగ్ థాయ్‌లాండ్‌లోని చియాంగ్ మాయి ప్రావిన్స్‌లో ఉన్న రాజమంగళ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ లన్నాలో చదువుతున్నారు. గతంలో మరణాలు సంభవించిన ఇండ్లను విక్రయించడంలో ప్రాపర్టీ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారికి తెలుసని చెబుతున్నారు. ఈ ఇండ్లను విక్రయించేందుకు ‘గోస్ట్ ఫ్రీ హోమ్ సర్టిఫైయర్స్’ అనే మార్కెట్ ఉందని, ఆ వ్యాపారంలో అడుగు వేయాలనే ఆలోచన వచ్చిందని చెబుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకటన..

శ్రేత్‌వుడ్ అనే విద్యార్థినులు ఇటీవల సోషల్ మీడియాలో తమ వింత సేవలను ప్రచారం చేయడం ప్రారంభించారు. హంటెడ్ హౌస్‌లు, అపార్ట్‌మెంట్‌లలో నిద్రిస్తారని ఆపై కొనుగోలుదారులు, అద్దెదారుల మనస్సులలో భయాన్ని తొలగిస్తారు. అంతేకాదు వారు 'ఘోస్ట్-ఫ్రీ సర్టిఫికేట్' కూడా జారీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తెగవైరల్ గా మారి ఈ వ్యాపారం గురించి థాయ్‌లాండ్ అంతటా వైరల్‌గా మారింది.

Advertisement

Next Story