చంద్రుడి పై కొవిడ్ లాక్‌డౌన్ ఎఫెక్ట్.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి

by Jakkula Mamatha |
చంద్రుడి పై  కొవిడ్ లాక్‌డౌన్ ఎఫెక్ట్.. తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడి
X

దిశ,వెబ్‌డెస్క్: గతంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్(Corona Virus) అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచమంతా కరోనా లాక్‌డౌన్(Corona Lockdown) మధ్య గది గోడలకే పరిమితమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితులు లేవు. ఆ సమయంలో దగ్గినా, తుమ్మినా కరోనా వైరస్ కావొచ్చు అనే భయాందోళనలో ప్రజలు ఉన్నారు. కొవిడ్-19 ప్రపంచాన్ని క్రమక్రమంగా కబళిస్తుండడంతో మొదటగా చైనా లాక్‌డౌన్ విధించింది. ఆ తర్వాత మిగతా దేశాలు కూడా లాక్‌డౌన్ విధించాయి. ఈక్రమంలో ఏప్రిల్-మే 2020 మధ్య లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా కర్ఫ్యూ వాతావరణం(Curfew weather) నెలకొంది. దీంతో రవాణా వ్యవస్థ(Transportation system) స్తంభించింది. ఫ్యాక్టరీలు కూడా మూతపడిన సందర్భాలు ఉన్నాయి.

ఈ క్రమంలో గ్రీన్‌హౌస్ ఉద్గారాల(Greenhouse emissions) విడుదల పూర్తిగా ఆగిపోయింది. ఈ సమయంలో వాతావరణంలో కూడా మార్పులు సంభవించాయి. ఇక ఈ ప్రభావం చంద్రుడిపైనా పడినట్టు నాసాకు చెందిన లూనార్ రీకనాయిసెన్స్ ఆర్బిటర్ (LRO) డేటాలో బయటపడింది. ఈ నేపథ్యంలో చంద్రుడి ఉపరితలంలోని 6 ప్రత్యేక భాగాల ఉష్ణోగ్రతలను అధ్యయనం చేయగా లాక్‌డౌన్ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత 8 నుంచి 10 (డిగ్రీలు) కెల్విన్ పడిపోయినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా 2017 -2023 వరకు డేటాను విశ్లేషించారు. లాక్‌డౌన్ సమయంలో వచ్చిన మార్పుల కారణంగా భూమి నుంచి వేడి గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమని అధ్యయనంలో వెల్లడించారు.

Next Story