సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం.. 54 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

by srinivas |
సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం.. 54 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
X

దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది మొట్టమొదటి సంపూర్ణ సూర్యగ్రహణం సోమవారం (ఏప్రిల్ 8) ఏర్పడనుంది. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే తొలిసారి. 1970లో చివరిసారిగా ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది. ఈ గ్రహణం ఎఫెక్ట్ లు ఎక్కడ ఉండనున్నాయి చాలా మందికి తెలిసి ఉండదు. ఈ గ్రహణాన్ని మీరు భారతదేశంలో మాత్రం చూడలేరు. అయితే ఈ గ్రహణం కారణంగా అనేక సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. మరి ఎలాంటి సమస్యలను ఎదుర్కోవచ్చో శాస్త్రవేత్తలు దీని గురించి ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది ?

చంద్రుడు, భూమి సూర్యుని మధ్య వెళుతున్నప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుంది. సూర్యున్ని పూర్తిగా కప్పివేసి ఆకాశాన్ని చీకటి చేస్తుంది.

శాస్త్రవేత్తలు, NASA నుండి హెచ్చరిక..

సంపూర్ణ గ్రహణానికి సంబంధించి అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నాసా, కొన్ని నివేదికల ప్రకారం ఈ గ్రహణం గురించి అనేక హెచ్చరికలు జారీ చేశారు. ఈ గ్రహణం సమయంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే కొన్ని నివేదికల ప్రకారం గ్రహణం సమయంలో అంత ప్రభావం ఉండదంటున్నారు. అంటే గ్రహణం ఏర్పడే సమయాల్లో హఠాత్తుగా ఏర్పడే చీకటి, వెలుతురు వల్ల ప్రమాదాలు జరగవు కానీ గ్రహణానికి ముందు, ఆ తర్వాత గంటలలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ అంటున్నారు.

గ్రహణం సమయంలో నెట్‌వర్క్ సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతున్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ గ్రహణాన్ని ఏకకాలంలో ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. దీని కారణంగా సర్వర్ డౌన్ కావచ్చు, నెట్‌వర్క్ జామ్ వంటి సమస్యలు కనిపించవచ్చు.

సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?

సంపూర్ణ సూర్యగ్రహణం ఎక్కడ సంభవిస్తుందనే దాని గురించి మనం మాట్లాడినట్లయితే ? NASA సూర్యగ్రహణం గురించి అమెరికాలోని అనేక పెద్ద ప్రాంతాల్లో సూచనలు జారీ చేసింది. నాసా నివేదిక ప్రకారం ఈ గ్రహణం టెక్సాస్, ఓక్లహోమా, అర్కాన్సాస్, మిస్సౌరీ, ఇల్లినాయిస్, కెంటకీ, ఇండియానా, ఒహియో, పెన్సిల్వేనియా, న్యూయార్క్, వెర్మోంట్, న్యూ హాంప్‌షైర్, మైనేలలో కనిపిస్తుంది. అయితే NASA ప్రకారం ఇది మిచిగాన్, టేనస్సీలలో కూడా కనిపిస్తుంది.

సంపూర్ణ సూర్యగ్రహణం ప్రత్యక్ష ప్రసారం..

ఈ సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే, అనేక సంస్థలు ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ఇందులో మీరు నాసా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. నాసా భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 నుండి తెల్లవారుజామున 1:30 వరకు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

మీరు ఈ దృశ్యాన్ని మీ కళ్లతో ప్రత్యక్షంగా చూడాలనుకుంటే NASA అధికారిక వెబ్‌సైట్ లింక్‌ పై క్లిక్ చేసి చూడవచ్చు. ఈ లింక్ ఏప్రిల్ 8న ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దీని కోసం మీరు నోటిఫికేషన్ ఎంపిక పై క్లిక్ చేయవచ్చు. దీంతో ఈ లింక్ ప్రత్యక్ష ప్రసారం అయినప్పుడల్లా, మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు దాని ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడైనా చూడాలనుకుంటే, మీరు ఇతర వెబ్‌సైట్‌లను కూడా సందర్శించవచ్చు.

Advertisement

Next Story