- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్ క్రోమ్‌ని వెంటనే అప్‌డేట్ చేసుకోండి.. లేకపోతే..
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో దాదాపు చాలా మంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడుతున్నారు. అయితే వీరందరికి కేంద్రం తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేసింది. వెంటనే తమ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కీలక ప్రకటన విడుదల చేసింది. భారత ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) క్రోమ్ బ్రౌజర్‌లో లోపాలు గుర్తించింది. దీని ద్వారా హ్యకర్స్ క్రోమ్ బ్రౌజర్‌లోకి చోరబడి యూజర్ల వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు దొంగలించే ప్రమాదం ఉందని CERT హెచ్చరించింది.
హ్యాకర్స్ ప్రాంప్ట్‌లు, వెబ్ చెల్లింపుల API, SwiftShader, Video, WebRTC లాంటి వంటి ద్వారా బ్రౌజర్‌లోకి చోరబడి మాల్వేర్‌లను ఇంజెక్ట్ చేసి డేటాను చోరి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి వెంటనే క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని కేంద్రం పేర్కొంది.
ముఖ్యంగా లైనక్స్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టంలలో క్రోమ్ బ్రౌజర్ 11.0.5790.170, విండోస్‌లో 11.0.5790.170/.171 వెర్షన్ వాడుతున్న వినియోగదారులు వెంటనే తమ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని ప్రత్యేక ప్రకటనలో పేర్కొన్నారు. అప్‌డేట్ చేసుకోకపోతే తక్కువ భద్రత ప్రమాణాలు కలిగిన సైట్లు, అశ్లీల వెబ్‌సైట్ల ద్వారా హ్యాకర్స్ మాల్వేర్‌ను ఇంజెక్ట్ చేసి వెంటనే కంప్యూటర్ నియంత్రణను తమ అధీనంలోకి తీసుకుని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తారు. కాబట్టి వెంటనే క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవడం ఉత్తమం.
- Tags
- google chrome