- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sunita Williams: అంతరిక్షంలోకి గణేషుడు.. సునీతా విలియమ్స్
దిశ వెబ్ డెస్క్: సునీతా విలియమ్స్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే రెండుసార్లు అంతరిక్షంలోని వింతలు చూసి వచ్చిన భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి రోదసీ యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. భారత కాలమానం ప్రకారం మే 7 ఉదయం 8.04 గంటలకు బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సునీతా విలియమ్స్ అంతరిక్షయానం చేయనున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. వినాయకుని ప్రతిమను తనతోపాటు తీసుకు వెళుతున్నట్టు తెలిపారు. వినాయకుని ప్రతిమ తనతో ఉంటే అదృష్టం కలిసివస్తుందని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. అలానే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) వెళ్తున్నప్పుడు తనకు తిరిగి ఇంటికి వెళ్తున్నట్టుగా ఉంటుందని తెలిపారు.
ఇక అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్టార్‌లైనర్‌కు ఇది మొదటి మానవసహిత యాత్ర అని, దీనితో కొంత భయాందోళనకు గురవుతున్నానని, అయితే కొత్త అంతరిక్ష నౌకలో ప్రయాణించే విషయంలో ఎలాంటి గందరగోళం లేదని చెప్పుకొచ్చారు. అలానే తనకు అంతరిక్షంలో సమోసా తినడం ఇష్టం అని తెలిపారు.
కాగా గతంలోనూ సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి తనతోపాటు భగవద్గీత తీసుకెళ్లారు. ఇక సునీతా విలియమ్స్ గుజరాత్‌కు చెందిన డాక్టర్ దీపక్ పాండ్యా మరియు బోనీ పాండ్యా దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి న్యూరోఅనాటమిస్ట్.