అదిరిపోయే ఫీచర్లతో Realme కొత్త Tab

by Harish |   ( Updated:2023-07-17 11:05:24.0  )
అదిరిపోయే ఫీచర్లతో Realme  కొత్త Tab
X

దిశ, వెబ్‌డెస్క్: రియల్‌మీ కంపెనీ నుంచి కొత్తగా ట్యాబ్ భారత మార్కెట్లోకి రాబోతుంది. ఈ మోడల్ పేరు ‘Realme Pad 2’. జులై 19న ఇండియాలోకి లాంచ్ అవుతున్నట్లు సమాచారం. జులై 26 నుంచి ముందస్తు బుకింగ్‌కు అందుబాటులో ఉండనుంది. ఇది గ్రే, గ్రీన్ రెండు కలర్స్‌లో లభిస్తుంది. దీని ఫీచర్ల విషయానికి వస్తే Realme Pad 2 ట్యాబ్ 2K రిజల్యూషన్‌తో 11.5-అంగుళాల LCD డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది MediaTek Helio G99 SoC ద్వారా పనిచేస్తుంది. 8GB RAM, 128GB స్టోరేజ్‌‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13-ఆధారిత యుఐ 4.0 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతుంది. దీనిలో USB టైప్-C ద్వారా 33W చార్జింగ్ సపోర్ట్‌తో 8,360mAh బ్యాటరీని అందించారు.

Advertisement

Next Story