కొత్త మోడల్ Realme C53 ఫీచర్స్ ఇవే!

by Harish |   ( Updated:2023-05-12 11:16:58.0  )
కొత్త మోడల్ Realme C53 ఫీచర్స్ ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: రియల్‌మీ నుంచి కొత్త మోడల్ ‘Realme C53’ త్వరలో భారత్‌లో విడుదల కానుంది. దీని గురించి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికి టిప్‌స్టర్ నివేదిక రాబోయే ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది. దీని ప్రకారం, ఈ మోడల్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల డిస్‌ప్లే ప్యానెల్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. Unisoc T612 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుందని తెలుస్తోంది. ఫోన్‌లో ప్రధానంగా మెయిన్ కెమెరా 50-మెగాపిక్సెల్, 0.3-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌, ముందు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. Android 13 ఆధారంగా రన్ అవుతుంది. 12GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ ధర రూ. 9,000-11,000 మధ్య ఉండనుంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు.






Advertisement

Next Story